30 నిమిషాల్లో 'ఎక్స్‌ప్రెస్ కారు లోన్స్ ' అందిస్తున్న ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు

     Written by : smtv Desk | Thu, Apr 28, 2022, 08:29 AM

 30 నిమిషాల్లో 'ఎక్స్‌ప్రెస్ కారు లోన్స్ '  అందిస్తున్న  ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు

మనం ఏదైనా వస్తువు కావాలి అని ఆశపడిన వెంటనే ఆ వస్తువుని క్షణాల్లో మన ముందు ఉంచుతున్నాయి ఈ కామర్స్ సంస్థలు. మరి కారు లోన్లను అలా ఎందుకు ఉంచకూడదు అనుకుంది దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ. తన కారు లోన్ వ్యాపారాలకు మరింత బూస్టప్ ఇచ్చేందుకు, కారు కొనుక్కోవాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు 30 నిమిషాల్లో కారు లోన్ డెలివరీని అందించడం ప్రారంభించింది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘ఎక్స్‌ప్రెస్ కారు లోన్స్(Xpress Car Loans)’ను మొదలు పెట్టింది. దీని ద్వారా తన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌పై 30 నిమిషాల్లో కస్టమర్లకు ఎండ్-టూ-ఎండ్ కారు లోన్లను ఆఫర్ చేస్తోంది. ఇండస్ట్రీలోనే ఇలాంటి ఆఫర్‌ను తీసుకురావడం కొత్త. అంతేకాదు ప్రపంచ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో 30 నిమిషాల్లో కారు లోన్ అందించడమనేదే తొలిసారి ప్రవేశపెట్టింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. ప్రస్తుతం సురక్షితమైన వెహికిల్ ఫైనాన్సింగ్ పొందాలంటే ఆసక్తిగల కస్టమర్‌కి ఎంత కాదనుకున్న 48 గంటల నుంచి 72 గంటల వరకు పడతుంది. హౌస్ లోన్ తర్వాత వినియోగదారులు ఎక్కువగా తీసుకున్న రెండో అతిపెద్ద లోన్ కేటగిరీ కారు లోనే.
2023 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు కారు లోన్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తేలిగ్గా 30 నిమిషాల్లో కారు లోన్ అందించడం ప్రారంభించిన బ్యాంకు.. త్వరలోనే టూవీలర్ లోన్లను కూడా జారీ చేయాలని చూస్తుందని బ్యాంకు అధికారులు తెలిపారు. మొత్తం డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారానే ఈ లోన్ల జారీ జరుగుతుంది.
ముఖ్యంగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో కారు రుణాలను పొందే ప్రక్రియను ఇది సులభతరం చేస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రిటైల్ నేషనల్ హెడ్ అరవింద్ కపిల్ తెలిపారు. ఇండస్ట్రీలో ఇది పెద్ద మొత్తంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందన్నారు. 90 శాతం కారు కొనుగోళ్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌గానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. సెమీ అర్భన్, రూరల్ ప్రాంతాల నుంచే కారు లోన్ల జారీ ప్రతేడాది 40 శాతం పెరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మొత్తం ఇంక్రిమెంటల్ గ్రాస్ సేల్స్ డెవలప్‌మెంట్‌లో 50 శాతం ఈ ప్రాంతాల నుంచే ఉంటుందని అన్నారు.





Untitled Document
Advertisements