స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. తగ్గిన వెండి ..

     Written by : smtv Desk | Thu, Apr 28, 2022, 08:31 AM

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. తగ్గిన వెండి ..

గడిచిన మూడు నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం రేట్లు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ.48,450గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు కూడా స్థిరంగా రూ.52,860 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలలో మార్పులేనప్పటికి సిల్వర్ రెట్లు మాత్రం కాస్త తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ రేటు కేజీకి రూ.200 తగ్గి రూ.69,800గా నమోదైంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,450గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,860 పలుకుతోంది. మరోవైపు వెండి రేటు ఢిల్లీ మార్కెట్లో రూ.300 తగ్గింది. ఈ తగ్గుదలతో వెండి ధర రూ.64,700కు పడిపోయింది. మన పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రంలోని విజయవాడలో కూడా బంగారం ధరలు మారలేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,450గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,860గా పలుకుతోంది. వెండి ధర మాత్రం కేజీకి రూ.200 తగ్గి రూ.69,800 వద్ద కొనసాగుతోంది.
చెన్నై బులియన్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఆ మార్కెట్లో రూ.190 తగ్గి, రూ.48,620గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.210 దిగొచ్చి రూ.53,040గా రికార్డయింది. సిల్వర్ రేటు కూడా చెన్నై మార్కెట్లో కేజీకి రూ.200 తగ్గి రూ.69,800గా నమోదైంది.
ముంబై మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,450గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,860గా రికార్డయ్యాయి. అలాగే వెండి రేటు కేజీకి రూ.300 తగ్గి రూ.64,700గా నమోదైంది.





Untitled Document
Advertisements