ఇకపై వాట్సాప్ పేమెంట్స్ చేసే వారికి అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!

     Written by : smtv Desk | Thu, Apr 28, 2022, 10:41 AM

ఇకపై వాట్సాప్ పేమెంట్స్ చేసే వారికి అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్లు!

గూగుల్ పే పేమెంట్ సంస్థ సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంస్థ విజయానికి ప్రధాన కారణం రివార్డులు. ఒక వ్యక్తి గూగుల్ పే ద్వారా గూగుల్ పే ఉపయోగించే వేరొక వ్యక్తికి డబ్బులు పంపితే అప్పుడు రివార్డు రూపంలో డబ్బులు వచ్చేవి. స్క్రాచ్ కార్డు వస్తుంది. దీన్ని స్క్రాచ్ చేస్తే ఎంత డబ్బులు వచ్చేది కనిపించేది. ఇలా చేయడం వల్ల అతితక్కువ కాలంలో గూగుల్ పే చాలా మందికి రీచ్ అయిపోయింది. తర్వాత గూగుల్ పే ఇలా రివార్డు రూపంలో డబ్బులు ఇవ్వడం ఆపేసింది. ఇప్పుడు కూపన్లు ఇస్తోంది. ఇవి చాలా మందికి ఉపయోగపడవనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఎందుకంటే వాట్సాప్ కూడా ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
భారతీయ కస్టమర్లను ఆకర్షించడానికి క్యాష్ బ్యాక్ రివార్డులు తీసుకురావాలనే ఆలోచనలో వాట్సాప్ ఉంది. పీర్ టు పీర్ పేమెంట్స్, మర్చంట్ పేమెంట్లకు ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా గూగుల్ పే సహా ఇతర సంస్థలకు పోటీ ఇవ్వాలని భావిస్తోంది. కాగా వాట్సాప్‌కు ఇటీవలనే రెగ్యులేటరీ అనుమతులు లభించాయి. వాట్సాప్ వచ్చే నెల చివరి నాటికి క్యాష్ బ్యాక్ ఆఫర్ తీసుకురావొచ్చు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.33 వరకు అందించే అవకాశం ఉంది. కస్టమర్లకు పొందాలనే లక్ష్యంతో వాట్సాప్ ఈ ఆఫర్ తీసుకురాబోతోందని తెలుస్తోంది.
వాట్సాప్ ఆఫర్ చేసే డబ్బులు తక్కువగా కనిపిస్తున్నా కూడా యూజర్ల చూపు తిప్పుకోవడానికి ఇది బాగా పని చేస్తుందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా తెలిపారు. కంపెనీ దశల వారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చు. దీని ద్వారా వాట్సాప్ పేమెంట్స్ పెరిగే అవకాశం ఉంది. హైవే టోల్స్, యుటిలిటీ బిల్లులు వంటివి చెల్లించే వారికి కూడా ఆఫర్లు అందుబాటులో ఉంచాలని కంపెనీ భావిస్తోంది. రిలయన్స్ జియో మొబైల్ పేమెంట్స్ నిర్వహించే వారికి కూడా ప్రోత్సాహకాలు అందించే ఛాన్స్ ఉంది. కాగా ఈ అంశంపై వాట్సాప్ కానీ, రిలయన్స్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా వాట్సాప్ 2021 జూన్ నెలలో ఇండియాలో పోటీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై స్టడీ చేసింది. ఇందులో ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఈ మార్గంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements