ఎవరు మంచి డాన్సర్ అంటే చెప్పడం కష్టమే.. మెగాస్టార్

     Written by : smtv Desk | Thu, Apr 28, 2022, 01:11 PM

ఎవరు మంచి డాన్సర్ అంటే చెప్పడం కష్టమే.. మెగాస్టార్

మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఆచార్య' రేపు ఆడియన్స్ ముందుకు రానుంది. ఆచార్య చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవి .. చరణ్ .. కొరటాల బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రబృందంను డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేశాడు.
'చరణ్ కాకుండా మీ దృష్టిలో మంచి డాన్సర్స్ ఎవరు? అనే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ .. "వాళ్లూ వీళ్లూ అని కాదండీ.. ఈ రోజున చాలా మంది చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. వీళ్లల్లా నేను చేయగలనా? అనే స్థాయిలో తారక్ .. అల్లు అర్జున్ .. రామ్ .. నితిన్ చేస్తున్నారు. అందరూ కూడా అత్యద్భుతంగా చేస్తున్నారు.
ఈ జనరేషన్ హీరోల్లో 'చంటబ్బాయ్' సినిమాను ఎవరు చేస్తే బాగుంటుందనే ప్రశ్నకి చిరంజీవి స్పందిస్తూ .. "బన్నీ బాగా చేస్తాడు. కామెడీ టచ్ ఉన్న ఇలాంటి రోల్స్ ను తను బాగా చేయగలడు" అని చెప్పుకొచ్చారు. 'మీరు ఒక్కసారి గా చరణ్ లా మారిపోతే చిరంజీవిగారిని ఏం అడుగుతారు?' అనే ప్రశ్నను కొరటాలను హరీశ్ అడగ్గానే, చిరంజీవి జోక్యం చేసుకుంటూ 'నా ఆస్తి పేపర్లు అడుగుతారు' అంటూ నవ్వేశారు.





Untitled Document
Advertisements