ఇకపై అమెజాన్ ప్రైమ్ లో పే ఫర్ మూవీ ఫీచర్

     Written by : smtv Desk | Fri, Apr 29, 2022, 11:32 AM

ఇకపై అమెజాన్ ప్రైమ్ లో పే ఫర్ మూవీ ఫీచర్

అమెజాన్ ప్రైమ్ వీడియో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు ఇండివిడ్యువల్ మూవీలను రెంట్‌లో చూసుకునేలా ‘పే పర్ వ్యూ’ సర్వీసును తీసుకొచ్చింది. ఈ సర్వీసు ప్రైమ్ సబ్‌స్క్రయిబర్లకు, నాన్ ప్రైమ్ సబ్‌స్క్రెయిబర్లకు అందుబాటులో ఉంటోంది. దీని కోసం ప్రైమ్ వీడియో యాప్‌, వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక ట్యాబ్‌ను అందిస్తోంది. ఒక్కసారి చూసేందుకు యూజర్లు రూ.69 నుంచి రూ.499 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీరు చూడాలనుకున్న కొత్త సినిమాని కొనుగోలు చేసిన తరువాత 30 రోజులలో చూడడానికి అందుబాటులోకి వస్తుంది. సినిమా చూడడానికి అడుబతులోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో యూజర్లు సినిమాని చూసేయాలి. అంటే కొత్త మూవీలను యూజర్లకు త్వరగా యాక్సస్ అందించేందుకు ఈ సరికొత్త సర్వీసును ప్రారంభించింది. కొత్త సినిమాలను చూడాలి అనుకునే యూజర్లు ముందే యాక్సస్ పొందేలా రెంట్ బేసిస్‌లో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంతేకాక రాబోయే రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో 40 కొత్త ఫిల్మ్స్‌ను, సిరీస్‌ను తన ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. రాబోయే 24 నెలల్లో తన ఒరిజినల్ సిరీస్‌ను, సినిమాలను లాంచ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ చేస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీసు భారత్‌తో ఐదేళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ ఏడాది ప్రైమ్ వీడియోపై రాబోతున్న వెబ్ సిరీస్‌లపై ప్రకటన చేసింది. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ అమెజాన్‌కు, నెట్‌ఫ్లిక్స్‌కు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు కీలకమైన మార్కెట్‌గా ఉంది. పే ఫర్ మూవీ ఫీచర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తేవడంపై తాము చాలా ఆనందంగా ఉన్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో హెడ్ గౌరవ్ గాంధీ చెప్పారు. ఈ సర్వీసు కస్టమర్ల రీచ్‌ను, ఎంపికను పెంచుతుందన్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో వచ్చే ఐదేళ్లలో తన ఇన్వెస్ట్‌మెంట్లను కూడా రెండింతలు పెంచాలని ప్లాన్‌లో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అయితే ఎంత పెట్టుబడి పెట్టనుందో తెలుపలేదు. కంపెనీ లాంచ్ చేసే ఒరిజినల్ సిరీస్‌లను కరణ్ జోహార్, జోయా అక్తర్ వంటి బాలీవుడ్ డైరెక్టర్లు రూపొందిస్తున్నారు. భారత్‌లో లోకల్ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేసేందుకు, కొనుగోలు చేసేందుకు అమెజాన్ భారీగా పెట్టుబడి పెట్టనుందని ఫౌండర్ జెఫ్ బెజోస్ అంతకుముందే చెప్పిన విషయం తెలిసిందే.


Untitled Document
Advertisements