ప్రభాస్ కోసం అనుష్కను సెట్ చేసే పనిలో మారుతి

     Written by : smtv Desk | Mon, May 02, 2022, 11:33 AM

 ప్రభాస్ కోసం అనుష్కను సెట్ చేసే పనిలో మారుతి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ హీరోయిన్ అనుష్క ఈ జంటకి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు జంటగా తెరకెక్కిన చిత్రాలన్నీ సూపర్ హిట్. అయితే 'బాహుబలి 2' సినిమా తరువాత ఈ జంట తెరపై కలిసి కనిపించలేదు. ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అనుష్క పూర్తిగా సినిమాలను తగ్గించింది. ఈ జోడీని మళ్లీ తెరపై చూపించేందుకు చాలామంది డైరెక్టర్స్ ట్రై చేస్తున్నారు. ఆ లిస్ట్ లో మారుతి పేరు కూడా వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి 'రాజా డీలక్స్' సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా పనులు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా అనుష్కను తీసుకోనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ఒక వార్త షికారు చేసింది. ఆమెనే ఎంపిక చేయనున్నారనేది తాజా సమాచారం. మరో ఇద్దరు హీరోయిన్స్ కి కూడా చోటు ఉండటంతో, ఎవరైతే బాగుంటారు అనే దిశగా అన్వేషణ సాగుతోందట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు.





Untitled Document
Advertisements