రష్యాకు భారత్ నుంచి ఆయుధాల సప్లై..

     Written by : smtv Desk | Wed, May 04, 2022, 01:01 PM

రష్యాకు భారత్ నుంచి ఆయుధాల  సప్లై..

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన రెండు నెలలు కావస్తుంది అయితే పశ్చిమ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా అనేక ఆంక్షలు విధిస్తుంది. అయితే బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికావంటి దేశాలు గ్రీన్ కు ఆయుధాలను సప్లై చేస్తున్నాయి దీనివల్లనే ఉక్రెయిన్ రష్యా తో తడబడగులుగుతుంది. ఉక్రెయిన్ ఏ మాత్రం చలించకుండా ఎదురు తిరగడంతో పుతిన్ సహనం నశించి నిరాశా నిస్ర్పహలకు లోనవుతున్నట్లు తెలుస్తోంది కానీ యుద్ధం మాత్రం ఆపేది లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రపంచం మొత్తం భయానక పరిస్థితుల్లో బతుకుతోంది. ఏం జరగబోతోందనే విషయంలో నిరంతరం ప్రజలు భయపడుతున్నారు.
పుతిన్ సేనలపై విమర్శల జడివాన కురుస్తోంది. రష్యా సేనల పోరులో అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మొదట జనావాసాలపై యద్ధం చేయమని చెప్పిన పుతిన్ సేనలు తరువాత మనసు మార్చుకుని ప్రజలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగానే లక్షలాది మంది జనాలు అసువులు బాస్తున్నారు.
ఉక్రెయిన్‌లో రష్యన్ ఆయుధాల ప్రవేశించడానికి భారత్‌లో కంపెనీలు సహకరిస్తున్నాయని బ్రిటన్‌కు చెందిన రక్షణ, భద్రత థింక్ ట్యాంక్ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ సంచలన వ్యాఖ్యలు వెలువరించింది. విదేశాలలో తయారు చేసిన ఆయుధ భాగాలు ఆంక్షలు బారినపడకుండా రష్యాకు రహస్యంగా తరలించడానికి భారత కంపెనీలు సహాయపడతున్నాయని పేర్కొంది. ‘ఆపరేషన్ జీ..ది డెత్ త్రోస్ ఆఫ్ యాన్ ఇంపీరియల్ డెల్యూషన్’పేరుతో వెల్లడించిన నివేదికలో సందేహాలు వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రకటన అనంతరం భారత్పై విదేశాల ఏ విధంగా స్పందింస్తాయి అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

Untitled Document
Advertisements