మీరు యూట్యూబ్ ఎక్కువగా చూస్తుంటారా.. ఈ విషయాల గురించి తెలుసుకోండి

     Written by : smtv Desk | Thu, May 05, 2022, 11:43 AM

మీరు యూట్యూబ్ ఎక్కువగా చూస్తుంటారా.. ఈ విషయాల గురించి తెలుసుకోండి

ప్రస్తుత రోజులలో యూట్యూబ్ చానల్స్ కి ఉన్న ఫాలోయింగ్ ఉన్న గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వంటింటి విషయాల నుండి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల వరకు అలాగే సినిమాల నుండి రాజకీయాల వరకు ఏ విషయం గురించైనా క్షణాల్లో చేరవేస్తుంది యూట్యూబ్.
అయితే యూట్యూబ్ చూసే వారికి ‘సబ్ స్క్రయిబ్ టు యూట్యూబ్ ప్రీమియం’ అంటూ ఒక నోటిఫికేషన్ కనిపించడం గుర్తుండే ఉంటుంది. ఉచిత ప్లాన్ తో పోలిస్తే ప్రీమియం ప్లాన్ కింద వీక్షకులకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను యూట్యూబ్ అందిస్తోంది.
ప్రకటనలు లేకుండా వీడియోలను చూడొచ్చు. ఉచిత ప్యాక్ కింద యూట్యూబ్ ను చూస్తున్న సమయంలో తరచుగా మధ్యలో ప్రకటనలు కనిపిస్తూ అడ్డుపడుతుంటాయి. ఈ ప్రకటనల అసౌకర్యం వద్దని భావించే వారికి ప్రీమియం ప్లాన్ అనుకూలం. అంతేకాదు నచ్చిన వీడియోలను ఆఫ్ లైన్ లో సేవ్ చేసుకోవచ్చు. వాటిని తీరికగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో సేవ్ చేసుకున్న వీడియోలను చూసేందుకు నెట్ అవసరం లేదు.
రూ.139 నెలవారీ ప్యాక్ ను యూజర్లు ప్రతి నెలా రెన్యువల్ చేసుకోవాలి. అదే ఆటోమేటిగ్గా రెన్యువల్ అయ్యే ఆప్షన్ ఎంపిక చేసుకుంటే నెలావారీ ప్యాక్ రూ.129కే వస్తుంది. మూడు నెలల ప్లాన్ రూ.399. వార్షిక ప్లాన్ రూ.1,290 అవుతుంది. ఈ రెండు ప్లాన్లు కూడా ఆటో రెన్యువల్ కావు. గడువు తీరిన తర్వాత యూజర్లే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు నెలవారీ ప్లాన్ ను రూ.79కే యూట్యూబ్ ఆఫర్ చేస్తోంది. తాను విద్యార్థిని అంటూ ఆధారం చూపించాల్సి ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు యూట్యూబ్ మ్యూజిక్ కూడా ఉచితమే.





Untitled Document
Advertisements