చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మారుపై మండిపడ్డ వీరేంద్ర సెహ్వాగ్..

     Written by : smtv Desk | Thu, May 05, 2022, 04:23 PM

చెన్నై సూపర్ కింగ్స్  కెప్టెన్సీ మారుపై మండిపడ్డ వీరేంద్ర సెహ్వాగ్..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ విషయం పై భారత మాజీ క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు.చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో కెప్టెన్సీ మార్పు నిర్ణయం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ధోనీ స్థానంలో జడేజాను కెప్టెన్ చేయడం ఓ తప్పుడు నిర్ణయం అని అభిప్రాయపడ్డాడు. "సీజన్ ఆరంభంలోనే చెన్నై జట్టు తప్పటడుగు వేసింది. జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడమే ఆ తప్పు. కెప్టెన్ అయిన జడేజా మిగతా సీజన్ కు కూడా నాయకుడిగానే కొనసాగాల్సింది. కానీ అలా జరగలేదు" అని పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఒకవేళ ఈ సీజన్ ఆరంభం నుంచే ధోనీ కెప్టెన్ గా ఉండుంటే చెన్నై ఇన్ని మ్యాచ్ ల్లో ఓడిపోయేది కాదు" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. సీజన్ ఆరంభం నుంచి చెన్నై బ్యాట్స్ మెన్ సరిగ్గా ఆడటం లేదని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఓపెనర్ గా వస్తున్న రుతురాజ్ గైక్వాడ్ ఆ మ్యాచ్లో సరిగ్గా ఆడితే మరో మ్యాచ్లో ఏ జట్టు పరుగులను అందించడంలేదు. ఒక మ్యాచ్ లో ధోనీ కొన్ని పరుగులు చేస్తే, మరో మ్యాచ్ లో గైక్వాడ్ పరుగులు చేస్తున్నాడు తప్పితే... చెన్నై బ్యాటింగ్ లైనప్ లో సమష్టి కృషి లోపించింది. ఇలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ స్థాయికి చేరుకుంటుందని సెహ్వాగ్ విచారం వ్యక్తం చేశాడు.





Untitled Document
Advertisements