జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేషన్స్..

     Written by : smtv Desk | Fri, May 06, 2022, 11:29 AM

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేషన్స్..

ఇద్దరు పాన్ ఇండియా లెవల్ లో పాపులర్ అయిన వారే ఒకరు 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరొకరు 'కేజీఎఫ్2' సినిమాతో దేశాన్ని ఊపేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. వీరిద్దరూ ఒక్కచోట కలిస్తే అదీ కుటుంబాలతో కలిసి కనిపిస్తే... సినీ ఫ్యాన్స్ కు ఇంతకంటే కన్నులపండుగ ఉండదేమో. ఇప్పుడు అదే జరిగింది. నిన్న ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీల వెడ్డింగ్ యానివర్సరీల సందర్భంగా ఇరు కుటుంబాలు ఒకే చోట కలిసి సెలబ్రేట్ చేసుకున్నాయి. ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖితలు వెడ్డింగ్ యానివర్సరీ వేడుక జరుపుకున్నారు.
ఇన్స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు. 'సరికొత్త ప్రారంభం' అంటూ ఎన్టీఆర్ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరోవైపు తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోంది. ఇది తారక్ కు 31వ మూవీ కావడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే మూవీ ఒక రేంజ్ లో ఉంటుందని, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.





Untitled Document
Advertisements