సితార ఇప్పటికే సతాయిస్తోంది.. మళ్ళీ మీరు రెచ్చగొట్టకండమ్మా.. మహేశ్ బాబు

     Written by : smtv Desk | Mon, May 09, 2022, 12:48 PM

సితార ఇప్పటికే సతాయిస్తోంది.. మళ్ళీ మీరు రెచ్చగొట్టకండమ్మా.. మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా గత రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సర్కారువారి పాట' చిత్రం విడుదలవుతుంది. ఈ చిత్రం మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో రూపొందింది. మైత్రీ - 14 రీల్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈచిత్రాన్ని ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ లో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. 'పెన్నీ' పాటలో సితార కనిపిస్తుందా? ఎండ్ టైటిల్స్ లో సితార పేరు వేశారా? అనే ప్రశ్నలు తాజా ఇంటర్వ్యూలో మహేశ్ కి ఎదురయ్యాయి.
అందుకు మహేశ్ స్పందిస్తూ .. "ఈ సినిమాలోని 'పెన్నీ' మేకింగ్ వీడియోను సితారతో కూడా చేయిద్దామనే ఆలోచన చేసింది తమన్. ఆ విషయం తమన్ నాకు చెప్పినప్పుడు షూటింగులో ఉన్నాను. తమన్ కి నమ్రత ఓకే చెప్పేయడం, షూటింగ్ చేసేయడం కూడా జరిగిపోయాయి. సితార డాన్స్ చూశాక తను గొప్ప ఆర్టిస్ట్ అవుతుందని అనిపించింది.
సితారతో చేసింది ఓన్లీ మేకింగ్ వీడియోనే. అందువలన తను మూవీలోని సాంగ్ లో కనిపించదు. "నేనెందుకు సినిమాలో లేను" అంటూ ఇప్పటికే తను నన్ను సతాయిస్తోంది. తన పేరు ఎండ్ టైటిల్స్ లో వేశారా ? అని మీరు అడుగుతున్నారు. ఈ మాట వింటే ఇప్పుడు మళ్లీ అదో పెద్ద గొడవై కూర్చుంటుంది. మీరు తనని ఉసిగొల్పకుండా ఈ టాపిక్ ని ఇంతటితో ఆపేయండి" అంటూ మహేశ్ నవ్వేశారు.





Untitled Document
Advertisements