భారత రాజకీయాల్లో ముదురుతున్న బుల్డోజర్ల వివాదం..

     Written by : smtv Desk | Mon, May 09, 2022, 01:13 PM

భారత రాజకీయాల్లో ముదురుతున్న బుల్డోజర్ల వివాదం..

కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత మనీష్ తివారీ ఇటీవల ఒక వ్యాసంలో "భాజపా ప్రభుత్వం దేశ ప్రజలపై బుల్‌డోజర్‌లను రెండవ ప్రపంచయుద్ధ కాలంలో యూదులకు వ్యతిరేకంగా నాజీల వలె ఉపయోగిస్తోంది” అంటూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆదివారం స్పందిస్తూ.. మనీష్ తివారీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. మనీష్ తివారీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మతిమరుపు వ్యాధి ఉందా? నాజీలు మరియు యూదులను మరచిపోండి, భారతదేశంలో మైనారిటీలపై బుల్డోజర్లను ఉపయోగించమని మొదట ఆదేశించినది ఇందిరా గాంధీ అని విమర్శించారు.
ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఏప్రిల్ 1976లో, ఎమర్జెన్సీ సమయంలో, ముస్లిం స్త్రీ పురుషులను సంహరించాలంటూ బలవంతం చేశాడు.దీంతో మైనార్టీలు తుర్క్‌మాన్ గేట్ వద్ద నిరసన వ్యక్తం చేయగా వారిని బుల్డోజర్లు చుట్టుముట్టాయి. ఈఘర్షణల్లో 20 మంది మరణించారు.ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో రాహుల్ గాంధీ మేనమామ సంజయ్ గాంధీ చేసిన ఈ మితిమీరిన చర్యల గురించి కూడా ఈ సందర్భంగా మాలవీయ ప్రస్తావిస్తూ అందుకు సంబందించిన ఒక పాత ఫోటోను సైతం మాలవీయ ట్వీట్ కి జత చేశారు.





Untitled Document
Advertisements