అమెరికా పై డ్రాగన్ దేశం ఆంక్షల విధింపు ..

     Written by : smtv Desk | Wed, May 11, 2022, 01:27 PM

అమెరికా పై డ్రాగన్ దేశం ఆంక్షల విధింపు ..

ప్రపంచం మీద అధిపత్యం కోసం అమెరికా తో పాటు డ్రాగన్ దేశం చైనా కూడా ప్రయత్నిస్తుంది. కరోనా వైరస్ కాలంలో చైనా పై చాలా వరకు దేశాలు తమదైన శైలిలో విమర్శలు కురిపించాయి. అయితే అమెరికా దేశం పై చైనా ఒక కీలక ఆంక్షలు విధించేందుకు సిద్దమైన్ధటా .. రేపేదైనా అనుకోని పరిస్ధితులు ఎదురైతే చైనాపై అమెరికా ఆంక్షలు విధించినపుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సొస్తుందని జిన్ పింగ్ ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. అయితే ఇప్పుడు చైనాలో ప్రభుత్వ ఆఫీసుల్లో వాడుతున్న కంప్యూటర్లను మార్చేయాలని చినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే చైనాలోని ప్రభుత్వ ఆఫీసుల్లో దాదాపుగా ఐదు కోట్లకు పైగా అమెరికా కంప్తేర్లు ఉన్నట్లుగా వెల్లడైంది. దశలవారీగా ఈ 5 కోట్ల కంప్యూటర్లను మార్చేయాలని డ్రాగన్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆఫీసుల్లోను ప్రభుత్వ ఏజెన్సీల్లోను ఇపుడు వాడుతున్న కోట్లాది కంప్యూటర్ల ద్వారా అమెరికా చైనాను ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయని డ్రాగన్ అనుమానిస్తోంది. చైనాలో అమెరికా తయారీ కంప్యూటర్లు హెచ్పీ డెల్ లాంటి కంప్యూటర్లను ప్రభుత్వ ఆఫీసులతో పాటు మామూలు జనాలు కూడా విపరీతంగా వాడుతున్నారు.కీలకమైన విభాగాల్లో విదేశీ టెక్నాలజీ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. అంతేకాక వీటికి ప్రత్యామ్నాయంగా రెండేళ్ళలోపు స్థానికంగా తయారు చేసిన డిజైన్ల కంప్యూటర్లను ఉపయోగించాలని కూడా డిసైడ్ చేసింది. చైనా తయారీ కంప్యూటర్ లెనోవా వాటి స్ధానాన్ని ఆక్రమిస్తుంది కాబట్టే. లెనోవా కంప్యూటర్లకు కూడా ప్రపంచంలో బాగానే డిమాండ్ ఉంది. డ్రాగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో లెనోవా కంప్యూటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవటం ఖాయం.ఇందులో భాగంగా దేశీయంగానే చిప్ లను తయారుచేయించేందుకు డ్రాగన్ 16 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.కావున కంప్యూటర్లలో వాడే చిప్ ల కోసం కూడా అమెరికా మీద ఆధారపడకూడదని డిసైడ్ అయ్యింది.





Untitled Document
Advertisements