తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

     Written by : smtv Desk | Thu, May 12, 2022, 07:44 AM

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

బంగారం కొనాలి అనుకుంటున్నారా? అయితే మీకిది శుభవార్త దేశవ్యాప్తంగా వరుసగా రెండో రోజూ బంగారం ధరలు తగ్గాయి. వెండి ధర అయితే భారీగా పతనమైంది. 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.47 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.46,750కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.380 తగ్గి రూ.51 వేలుగా నమోదైంది. బంగారంలానే వెండి ధర కూడా బారీగా తగ్గింది. వెండి కేజీపై రూ.1,300 తగ్గడంతో ఈ ధర హైదరాబాద్‌లో రూ.64,800గా రికార్డయింది. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అక్కడ కూడా 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గింది. దీంతో ఈ ధర రూ.46,750గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.51 వేలుగా రికార్డయింది. సిల్వర్ రేటు కూడా ఢిల్లీలో భారీగానే పతనమైంది. కేజీపై రూ.1,500 పతనం కావడంతో.. ఈ ధర రూ.60,400కు దిగొచ్చింది.
విజయవాడలో బంగారం ధరలు కూడా డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. ఇక్కడ కూడా వరుసగా రెండో రోజూ ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర విజయవాడలో రూ.350 తగ్గడంతో.. ఈ రేటు రూ.46,750గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గిపోయి రూ.51 వేలకు పడిపోయింది. సిల్వర్ రేటు విజయవాడలో రూ.1300 తగ్గడంతో కేజీ రూ.64,800గా ఉంది.
హైదరాబాద్‌తో పాటు మిగిలిన బులియన్ మార్కెట్లలో కూడా ధరలు తగ్గాయి. అయితే చెన్నైలో మాత్రం మిగిలిన మార్కెట్లతో పోలిస్తే బంగారం ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర చెన్నై మార్కెట్లో రూ.590 తగ్గడంతో ఈ ధర రూ.47,870గా రికార్డయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధరపై రూ.640 తగ్గడంతో.. ఈ ధర రూ.52,220కు పడిపోయింది. బంగారంతో పాటు వెండి రేటు కూడా కుప్పకూలింది. ఈ ధరపై రూ.1,300 తగ్గడంతో.. కేజీ రూ.64,800గా రికార్డయింది.





Untitled Document
Advertisements