టేకాఫ్ కు సిద్ధమైన సమయంలో తప్పిన ఘోర ప్రమాదం..13 మంది ప్రయాణికులు సేఫ్!

     Written by : smtv Desk | Thu, May 12, 2022, 09:43 AM

టేకాఫ్ కు సిద్ధమైన సమయంలో తప్పిన ఘోర ప్రమాదం..13 మంది ప్రయాణికులు సేఫ్!

ఒక్కోసారి అంతా బాగుంది అనుకునే సమయంలో ఊహించని విధంగా ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటిదే చైనాలోని చాంగ్ కింగ్ ఎయిర్ పోర్టులో జరిగింది. టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ కు విమానం సిద్ధమైన సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది... ప్రయాణికులను, విమాన సిబ్బందిని అత్యవసర మార్గాల గుండా కిందకు దించారు. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి.





Untitled Document
Advertisements