లాభాల దారుల్లో ఎయిర్ ఇండియాని నడపటానికి నూతన సీఈఓ గా విల్సన్ నియామకం ..

     Written by : smtv Desk | Thu, May 12, 2022, 04:49 PM

లాభాల దారుల్లో ఎయిర్ ఇండియాని నడపటానికి నూతన సీఈఓ గా విల్సన్ నియామకం ..

భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఎంతగానో పేరు గడించింది. అయితే మెల్లమెల్లగా నష్టాలూ వస్తున్న తరుణంలో మళ్ళి ప్రైవేటు రంగంలోకి చేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను టాటా సన్స్ కొనుగోలు చేసుకున్నారు. అయితే ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ మళ్ళి లాభాల్లో తీసుకొని రావడానికి ఒక కీలక వ్యక్తిని రంగంలోకి దింపి పూర్తి భాద్యతలు అప్పజెప్పింది. ఎయిరిండియా ఎండీ, సీఈవోగా క్యాంప్ బెల్ విల్సన్ ను నియమించింది. ఈ నియామకానికి ఎయిరిండియా బోర్డు కూడా ఆమోదం తెలిపడం విశేషం . క్యాంప్ బెల్ విల్సన్ 56 ఏళ్ల వయసున్నప్పటికీ విమానయాన రంగంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉండటం విశేషం .ఇప్పటివరకు సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ స్కూట్ కు సీఈవోగా వ్యవహరించారు. టాటాల అధీనంలోని ఎయిరిండియా సంస్థకు తనను ఎండీ, సీఈవోగా నియమించడం పట్ల క్యాంప్ బెల్ విల్సన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నియామకం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. అయితే విమానయాన రంగంలో ఇంతగా అపార అనుభం కలిగిన విల్సన్ కు భాద్యతలు అప్పగించడం లో టాటా గ్రూప్ కి ఎంతగానో కలిసొచ్చే విషయమేనని వ్యాపార రంగ నిపుణులు భావిస్తున్నారు .







Untitled Document
Advertisements