షేన్ వాట్సన్ వ్యాఖ్యలపై స్పందించిన ఇషాన్ కిషన్ ..

     Written by : smtv Desk | Thu, May 12, 2022, 05:56 PM

షేన్ వాట్సన్ వ్యాఖ్యలపై స్పందించిన ఇషాన్ కిషన్ ..

ఐపిఎల్ వేలంలో అతితక్కువ ధరకు కొనుగోలు అయిన ఆటగాడు అత్యద్భుతంగా ఆడొచ్చు..లేదా.. అత్యంత ధర పలికిన ఆటగాడు తక్కువగా పెర్ఫార్మన్స్ చేయొచ్చు ..లేదా.. ధరకు తగ్గ న్యాయం చేయవచ్చు కూడా .. అయితే ఈసారి ఐపీఎల్ 2022 అత్యంత ఖరీదైన ఆటగాడిగా ముంబయి ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ మొదటిసారి ఓపెన్ అయ్యాడు. తమ జట్టు పూర్వపు ఆటగాడు కాబట్టి తన మీద నమ్మకంతో ముంబై యాజమాన్యం ఇషాన్ కిషన్ ను వదులుకోలేదు. అందుకు ఇషాన్ కిషన్ కోసం 15 కోట్లనే వెచ్చించింది. అయితే ఆటగాడి ఆటతీరు అనేది ఎప్పడు ఒకేలా ఉండాలనేది ఏమీలేదు.. ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్.. ఇషాన్ కిషన్ ధరపై గతంలో చేసి కమెంట్స్ వైరల్‌గా మారడంతో.. అందుకు సమాధానంగా వ్యాఖ్యలు చేశాడు. వేలంలో రూ.15.25 కోట్ల ధర పలకడం నా తప్పు కాదు.. అది కేవలం ఫ్రాంచైజీల వ్యక్తిగత నిర్ణయం అంటూ చెప్పొకొచ్చాడు."వేలంలో మనం పలికిన ధరకు మనకు బాధ్యులుం కాదు కదా. ముందు మనం అది అర్థం చేసుకోవాలి. ఈ విషయమై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కూడా మాట్లాడాను. ఎందుకంటే వాళ్లు కూడా ఒకప్పుడు భారీ ధరకే కొనుగోలయ్యారు. అందుకనే ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలని వాళ్లని అడిగాను. వాళ్లు నాకు ఒక్కటే చెప్పారు.. ధర గురించి నువ్వెప్పుడూ ఆలోచించొద్దు.. నీ జట్టు కోసం వంద శాతం పోరాడావా లేదా అనేదే చూడు. బేసిక్ ధరకు అమ్ముడయ్యావా.. అధిక ధరతో కొనుగోలయ్యావా అనేది పట్టించుకోవద్దని చెప్పారు" అంటూ ఇషాన్ కిషన్ చాలా రోజుల తర్వాత తన మనస్సులోని మాటను బయటపెట్టాడు. అయితే ఆటగాడికై వేలం చెల్లించిన దానిని బట్టి ఆటగాడిపై విమర్శలు చేయడం సరికాదని ఇషాన్ కిషన్ కు మద్దతుగా తను చెప్పిన ఈ మాటలను ముంబై ఇండియన్స్ జట్టు తమ ట్విట్టర్ అకౌంట్ లో వీడియొ గా పోస్ట్ చేసింది .

https://twitter.com/mipaltan/status/1524373873957142528?s=20t=b6Gld8cIu1kuk5PYGRsdzQ





Untitled Document
Advertisements