ఆర్ఆర్ఆర్ ఒటిటి కి సరికొత్త ట్రైలర్ ..

     Written by : smtv Desk | Fri, May 13, 2022, 03:11 PM

ఆర్ఆర్ఆర్ ఒటిటి కి సరికొత్త ట్రైలర్ ..

జూనియర్ ఎన్టిఆర్ మరియు రామ్ చరణ్ కథానాయకులుగా కొమురం భీం మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలలో నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం మార్చ్ 25 న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే..ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ రికార్డుల మోత మోగించింది.దక్షిణాది చిత్రాల సత్తాని మరోసారి యావత్ ప్రపంచానికి చాటి సౌత్ సినీ ఇండస్ట్రీకి సరికొత్త ఊపునిచ్చింది. పాన్ ఇండియా వైడ్ గా భారీ వసూళ్లని రాబట్టి వెయ్యి కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన చిత్రాల క్లబ్ లో చేరింది. ఇదిలా వుంటే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాని ఓటిటి వేదికగా మే 25 జీ 5 వేదికగా విడుదల కానుంది. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఓటీటీ వెర్షన్ లో సినిమాలో చూపించని చాలా సన్నివేశాలని చూపించబోతున్నారని స్పష్టమైంది. ''ప్రతి తూటా మీద చచ్చేవాడి పేరు రాసుంటుంది. ప్రతి తుపాకీ మీదా పేల్చేవాడి పేరుంటుంది. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయ్.. '' మరియు ''పాణం కంటే విలువైన నీ సోపతే నా సొంతం అన్న ''వంటి పవర్ ఫుల్ డైలాగ్ లతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దీంతో చాలా మంది అంట థియేటర్లలో సినిమాని చూడని వారు చూసిన వారు కూడా ఓటీటీ వెర్షన్ కోసం విరగబడటం ఖాయంగా కనిపిస్తోంది. ఓటిటి లో విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఒక ట్రైలర్ ణి కూడా చిత్ర బృందం విడుదల చేసింది . ఆ ట్రైలర్ లింక్ కింద ఉంది వెంటనే వెళ్లి చూసేయ్యండి .

https://youtu.be/dyUF4qS35LU





Untitled Document
Advertisements