మరో కొత్త తెలుగు సీన్ తో డేవిడ్ వార్నర్ ..

     Written by : smtv Desk | Fri, May 13, 2022, 04:16 PM

మరో కొత్త తెలుగు సీన్ తో డేవిడ్ వార్నర్ ..

ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అనగానే గురించి తెలుగు ప్రేక్షకులకు బుట్టబొమ్మ స్టెప్స్ మరియు తెలుగులో ప్రత్యేకమైన డైలాగ్స్ కి పేస్ మర్పింగ్ చేస్తూ వీడియోలు షేర్ చేసేవాడు. అలాంటి డేవిడ్ వార్నర్ ఇప్పటికే అల్లు అర్జున్.. మహేష్ బాబు ఇంకా కొందరిని అనుకరిస్తూ చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉన్నా కూడా డేవిడ్ వార్నర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఫేస్ ను మార్ఫ్ చేసి తన ఫేస్ ను పెట్టి వీడియోను షేర్ చేసి అందరిని ఆకర్షించాడు. రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన బ్రూస్ లీ సినిమా లో చిరంజీవి క్లైమాక్స్ లో కొద్ది సమయంకనిపించిన సీన్ ని వార్నర్ మొర్ఫ్ చేసి తన పేస్ ని పెట్టుకున్నాడు. ఆ సమయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ఆయన స్టైల్ ను మెగా అభిమానులు అంత సులువుగా మర్చిపోరు. అలాంటి చిరు వీడియోను వార్నర్ మార్ఫ్ చేసి తనకు అనుకూలంగా మార్చుకుని సోషల్ మీడియాలో సందడి చేశాడు. కాగా వార్నర్ చేసిన ఈ పోస్ట్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు చిరు అభిమానులు . ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడటంతో పాటు సోషల్ మీడియాలో పలు తెలుగు సినిమాలకు సంబంధించిన ఫేమస్ డైలాగ్స్ ను మరియు పాటలను మరింత ఫేమస్ అయ్యేలా ఇన్ స్టా గ్రామ్ లో వీడియోలు చేసి ఆకట్టుకున్నాడు. డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా లో ఒక సెన్షేషన్.





Untitled Document
Advertisements