వైరల్ అవుతున్న సమంతా బాక్సింగ్ పిక్ ..

     Written by : smtv Desk | Sat, May 14, 2022, 06:31 PM

వైరల్ అవుతున్న సమంతా బాక్సింగ్ పిక్ ..

ఇటివల కాలంలో సమంత కొత్త ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇందులో సమంత జిమ్ లో బాక్సింగ్ చేస్తున్న లుక్ లో కనిపిస్తుంది. టైట్ ఫిట్ దుస్తులు ధరించి చేతులకు గ్లౌసస్ ధరించి టార్గెట్ ని ఫిక్స్ చేసి పంచ్ పవర్ విసరడానికి పోజిషన్ లో నిలబడి ఉంది. ఈ ఫోటోని ఉద్దేశించి `ఫైట్ మోడ్` అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుఈ ఫోటో సమంత అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. సమంత `యశోద` అనే లేవీ ఓరియేంటెడ్ మూవీలో నటిస్తోంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. హరి శంకర్-హరీష్ అనే ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. తెలుగు..తమిళ్ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. అయితే సామంత ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కోసమే ఫిట్నెస్ ను పెంచుకొనుందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సమయంలోనే సమంతా తన ఫిట్నెస్ సీక్రెట్ ణి రివీల్ చేసింది. '`నేను బరువులు ఎక్కువగా ఎత్తుతాను. అలాగని యానిమల్ ప్రొటీన్ తీసుకోను. వెజిటబుల్స్ తీసుకుంటా.. పచ్చదనం(గ్రీన్) నిండిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతాను. మోర్నింగ్ రొటీన్ ప్రొటీన్ షేక్స్ తీసుకుంటాను. వీటితో పాటే నిరంతరం నీళ్లు తాగుతాను అని టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు. జిమ్ కి వెళ్లే ముందు.. గుడ్డు బట్టర్ వంటివి పరిమితంగా తింటానని`` వెల్లడించారు. అయితే సమంతా రోజు ఎన్నో రకాల ఎక్సర్సైజు లు చేస్తున్న విషయం తెలిసిందే ..





Untitled Document
Advertisements