పంజాబ్ పై ఢిల్లీ విజయం ..ఏడో స్థానానికి పంజాబ్ ..

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 10:23 AM

పంజాబ్ పై ఢిల్లీ విజయం ..ఏడో స్థానానికి పంజాబ్ ..

ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా సోమవారం రాత్రి డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ కి మద్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు చేజింగ్లో ఏ మాత్రం నిలవలేకపోవడంతో పంజాబ్ జట్టు ఓటమి పాలయ్యింది.ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బాట్స్మెన్ లలో వార్నర్ డకౌట్ అవ్వగా మిచెల్ మార్ష్ 63 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులతో రాణించారు. లలిత్ యాదవ్ 21 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
కెప్టెన్ రిషబ్ పంత్ రెండో బంతికే సిక్సర్ బాదగా.. ఆ తర్వాతి బంతిని కూడా బౌండరీ తరలించే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. పావెల్ కూడా 2 , శార్ధూల్ ఠాకూర్ 3 పరుగులకే పరిమితమయ్యారు . అక్షర్ పటేల్7, కుల్దీప్ యాదవ్ 2 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టన్, అర్షదీప్ సింగ్ చెరో మూడు వికెట్లతో ఢిల్లీ బ్యాట్టేర్లను బోల్తా కొట్టించగా .. రబడ ఒక వికెట్ పడగొట్టాడు.
ఢిల్లీ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌తో రెండవ ఇన్నింగ్స్ ణి ప్రారంభించిన ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ శుభారంభం అందించినా.. ఆ తర్వాత ఆటగాళ్లెవ్వరూ ఆ స్థాయిలో రాణించలేకపోయారు. బెయిర్ స్టో 28 పరుగులు చేసి నోకియా బౌలింగ్‌లో అవుటవ్వగా.. శిఖర్ ధావన్ 19 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. రాజపక్స 4 లివిన్గ్స్టన్ 3 మయంక్ అగర్వాల్ 0 లు తొందరగానే పెవిలియన్ చేరుకోగా , జితేష్ శర్మ 44 పరుగులతో స్కోరును ముందుకు తీసుకెళ్ళే సమయంలో అవుట్ అయ్యాడు.మిగతా బ్యాటర్లలో రిషి దవాన్ 4 రాహుల్ చహార్ 25 పరుగులతో రాణించగా రాబడ 6 అర్శదీప్ 2 పరుగులతో అవుట్ అవడంతో అల్ అవుట్అ య్యింది. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది . ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోగా.. పంజాబ్ ఏడో ప్లేస్‌కే పరిమితమైంది.






Untitled Document
Advertisements