2014 మే 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అచ్చే దిన్ ట్వీట్‌కు కేటిఆర్ కౌంటర్ ..

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 10:34 AM

2014 మే 16న  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ చేసిన అచ్చే దిన్  ట్వీట్‌కు కేటిఆర్ కౌంటర్ ..

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ లో ఎంత ఆక్టివ్ గా ఉంటారో తెలిసిందే.. ఇటివల రాహుల్ గాంధీ తెలంగాణా పర్యటన సమయంలో ఆయన సోదరి ఎమ్మెల్సి కవితతో పాటు ట్విట్టర్ వేదికగా విరుచుకు పడుతున్నారు. మొన్న అమిత్ షా పర్యటన అప్పుడు కూడా ఆయనకు ప్రశ్నలు సంధించారు కేటిఅర్. అయితే ఇప్పుడు 2014 మే 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ బదులిస్తూ.. కొన్ని విషయాలను ప్రస్తావించారు. అయితే నరేంద్ర మోడీ చేసిన ట్వీట్లో ‘భారత్ గెలిచింది. ఇది దేశం సాధించిన విజయం. అచ్చే దిన్ (మంచి రోజులు) వస్తున్నాయి’అని వ్యాఖ్యానించారు. అయితే కేటిఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి అచ్చే దిన్ అంటే ఇవేనా అంటూ కౌంటర్ ఇచ్చారు.అచ్చే దిన్ తీసుకొస్తామని వాగ్దానం చేసి 8 ఏళ్లు పూర్తయ్యిందన్న కేటీఆర్.. ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ సాధించింది ఇదంటూ చెప్పుకొచ్చారు. ‘రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయికి (రూ.77.80) చేరింది. గత 45 ఏళ్లలో లేని అత్యధిక నిరుద్యోగం దాపురించింది. 30 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం చేరుకుంది. ప్రపంచంలో వంట గ్యాస్ ధర అత్యధికంగా ఉన్న దేశంగా భారత్ నిలిచింది. 42 ఏళ్ల అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్యవస్థ దిగ‌జారింది’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘వెల్ డన్ సార్..’ అంటూ ప్రధానిపై సెటైర్లు వేశారు. ఈ విధంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

https://twitter.com/KTRTRS/status/1526218812822937600?s=20t=hAwdt3tFSKpgqqmmStc_Gw





Untitled Document
Advertisements