ఆదిలాబాద్ లోని సిసిఐ యూనిట్ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరణ కొరకు కేంద్రమంత్రికి కేటిఆర్ వినతి

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 11:11 AM

ఆదిలాబాద్ లోని  సిసిఐ యూనిట్  సిమెంట్  పరిశ్రమను పునరుద్ధరణ కొరకు కేంద్రమంత్రికి కేటిఆర్ వినతి

ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ పరిశ్రమను పునరుద్ధరించాలని, జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా పోరాడుతుంటే.. మరోవైపు పరిశ్రమ తొలగింపునకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది' అంటూ జోగు రామన్న ట్వీట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన అంశాలను తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్ ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ ను సమీక్షించి, దాన్ని పునరుద్ధరించాలని కోరారు. దీనికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్టు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసారు. అంతేకాక యూనిట్ పునరుద్ధరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. ఈ యూనిట్ పునరుద్ధరింపబడితే... ఆదిలాబాద్ కు చెందిన వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. అంతేకాక గతంలో నుండి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సిసిఐ పునరుద్దరణ కొరకు చేసిన ట్వీట్లను కూడా షేర్ చేసారు మంత్రి కేటిఆర్. అయితే ఒక వైపు కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూనే మరో వైపు నెమ్మదిగా గౌరవపుర్వకమైన ట్వీట్లు చేస్తున్నారు కేటిఆర్ .





Untitled Document
Advertisements