లంకా ఎయిర్ లైన్స్ అమ్మకానికి ..

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 11:21 AM

లంకా ఎయిర్ లైన్స్ అమ్మకానికి ..

తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురుకుంటున్న శ్రీలంకలో ఎంతో ఉద్రిక్తతమైన నిరసనల వాళ్ళ దేశం అట్టుడికిపోయిన
సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో మహిందా రాజపక్స తర్వాత రణిల్ విక్రమ సింఘే ప్రధాని అయిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోని ఆర్థిక సంక్షోబాన్ని గట్టెక్కించడం కోసం ఆ దేశ నూతన ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో శ్రీలంక లేకపోవడంతో.. జీతాలిచ్చేందుకు నగదును ముద్రించాలని విక్రమసింఘే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో శ్రీలంక కరెన్సీపై ఒత్తిడి పడే ప్రమాదం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ముందు మరో దారి లేకపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం.. అప్పులను తీర్చడం కోసం జాతీయ విమానయాన సంస్థను ప్రయివేట్‌పరం చేయాలని భావిస్తోంది. 2021 మార్చి చివరి నాటికి శ్రీలంక ఎయిర్‌లైన్‌కు 370 బిలియన్ రూపాయల మేర నష్టాలున్నాయని ప్రధాని రణిల్ విక్రమ సింఘే తెలిపారు. 2015 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న విక్రమసింఘే ఎయిర్‌లైన్స్‌ను ప్రయివేటీకరించలేకపోయారు. 1975లో ఏర్పాటైన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లోని 126 ప్రదేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 2010లో శ్రీలంక ప్రభుత్వం దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ నుంచి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో వాటాను తిరిగి దక్కించుకుంది. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌లో 25 ఎయిర్‌బస్ ఎస్ఈ విమానాలు ఉన్నాయి. ఎయిర్‌లైన్స్‌ను ప్రయివేటీకరించిన తర్వాత కూడా నష్టాలను భరించాల్సి ఉంటుందన్న విక్రమసింఘే.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా విమానం ఎక్కని నిరుపేదలు ఈ నష్టాలను భరించాల్సి ఉంటుందన్నారు.





Untitled Document
Advertisements