బాలయ్యబాబు సినిమాలో డింపుల్ హయతి ..

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 12:49 PM

బాలయ్యబాబు సినిమాలో డింపుల్ హయతి ..

''ఖిలాడి '' సినిమాతో రవితేజ సరసన కథానాయికగా హాట్ బ్యూటీ డింపుల్ హయతి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కుర్రకారు సొగసులతో ప్రేక్షకుల మతిపోగొట్టేసింది ఈ సుందరి. తన హాట్ హాట్ సొగసులతో అందరిని ఇట్టే కట్టిపట్టేసింది. అయితే ఈ సినిమా కంటే ముందే 'గద్దలకొండ గణేశ్' సినిమాలో 'జర్రా జర్రా' ఐటమ్ సాంగ్ తో ఆమె అందరిని ఆగం చేసింది. అయితే ఖిలాడి సినిమా అందరిని అందుకోలేకపోయినా డింపుల్ హయతి హాట్ బ్యూటీ గా అందరిని అలరించింది. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న బాలయ్యబాబు 107వ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో నడవబోతుందని సమావేశం . బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ సినిమా కోసం మాస్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ ను తమన్ కంపోజ్ చేశాడట. ఇక ఇప్పుడు బాలకృష్ణతో కలిసి ఆమె ఒక మాస్ మసాలా సాంగ్ లో సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ పాటను డింపుల్ హయతి పై చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో డింపుల్ హయతి నటిస్తున్న ఐటమ్ సాంగ్ ప్రత్యేకంగా ఉండనుందట ..





Untitled Document
Advertisements