ప్రపంచ క్రికెట్ కు పరిచయమైన జూనియర్ మలింగా

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 02:34 PM

ప్రపంచ క్రికెట్ కు పరిచయమైన జూనియర్  మలింగా

ప్రపంచ క్రికెట్ లో ప్రముఖ బౌలింగ్ దిగ్గజం శ్రీలంక సీమర్ లసిత్ మలింగా స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక యువ ఆటగాడు సిద్దం అవుతున్నాడు. అయితే ఈ సీమర్ పేరు మతీశ పతిరణ. దిగ్గజ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్ ను పోలిన బౌలింగ్ తో బ్యాటర్స్ ను బెంబెలేత్తిస్తున్నాడు. అండర్ 19 ప్రపంచకప్ లో మహిష పతిరణ తనదైన ప్రతిభ చాటడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ యువ ఆటగాడిని సొంతం చేసుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అరంగేట్రం చేశాడు.మొన్నటి వరకు బెంచ్ కే పరిమితం అయిన అతడు.. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ తో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు.చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఆడమ్ మిల్నే గాయంతో తప్పుకోవడంతో.. అతడి స్థానంలో పతిరణను ధోని టీం తీసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన ఈ జూనియర్ మలింగ తనపై ఉన్న అంచనాలను అందుకున్నాడు. ఐపీఎల్ లో వేసిన తొలి బంతికే గుజరాత్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ వికెట్ ను తీసి అదరగొట్టాడు. పతిరణ బౌలింగ్ యాక్షన్ ను అర్థం చేసుకోవడంలో విఫలం అయిన గిల్.. వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మహిష పతిరణ ను మెచ్చుకున్నాడు . ఇక ఈ జూనియర్ మలింగా [మహిష పతిరణ ] బౌలింగ్ యాక్షన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.






Untitled Document
Advertisements