మాతృభాషకు అడ్డొస్తే సహించేదే లేదు ..

     Written by : smtv Desk | Tue, May 17, 2022, 04:53 PM

మాతృభాషకు అడ్డొస్తే సహించేదే లేదు ..

కమల్ హాసన్ గత ఎన్నికల్లో తమిళనాడులోని రెండో పెద్ద నగరం కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈయన నేడు సినిమాలలో ఎంత బిజీ గా ఉన్నా సరే రాజకీయాల్లో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ 3.78 శాతం ఓట్లు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2.62 శాతం ఓట్లు సాధించింది. అయితే.. అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరు కూడా ఆ పార్టీ తరఫున గెలుపొందలేదు. అయినా కూడా ఎటువంటి నిరుత్సాహం లేకుండా ఇంకా ఆక్టివ్ గానే పనిచేస్తున్నారు. ఇటివల కాలంలో కమల్ హసన్ కేంద్రప్రభుత్వ వైఖరి పై జోరుగా విమర్శలు చేసారు. హిందీని జాతీయ భాషగా చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై కమల్ హాసన్ మండిపడ్డారు. తన మాతృభాష తమిళానికి అడ్డు వస్తే హిందీని తప్పకుండా వ్యతిరేకిస్తానన్నారు. మాతృభాష మాట్లాడేవాడిగా తమిళం వర్థిల్లాలి అని చెప్పడం తన బాధ్యత అని చెప్పారు. తమిళానికి ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటా అని స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతి వ్యక్తి తన మాతృభాషను మాట్లాడటం మరిచిపోవద్దని కోరారు. మాతృభాషను ప్రేమించే వాళ్ళ పై మరొక భాషనూ రుద్దడం ఏంటి అని ప్రశ్నించారు. మరోవైపు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఎన్నో భాషలున్నాయని.. ఎవరి మాతృభాషలో వారిని మాట్లాడుకోనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎవరికైనా ఏదైనా భాష నేర్చుకోవాలనిపిస్తే వారే ఇష్టపూర్వకంగా నేర్చుకుంటారు కానీ బలవంతంగా రుద్దడం సరికాదన్నాడు.





Untitled Document
Advertisements