టిమ్ డేవిడ్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా .. 3 పరుగులతో హైదరాబాద్ విజయం

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 10:50 AM

టిమ్ డేవిడ్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా .. 3 పరుగులతో హైదరాబాద్ విజయం

ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియాన్స్ కి మధ్యజరిగిన మ్యాచ్ లో 194 పరుగుల భారీ స్కోర్ ఛేజింగ్‌లో ముంబయి ఆటగాళ్లు హైదరాబాద్ బౌలర్లకు దీటుగా ఎదుర్కొని మరి ఫైట్ చేసారు. కాని కేవలం మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబయిని కట్టడి చేయడంలో విఫలమైన హైదరాబాద్ జట్టు నామమాత్రపు విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటగా బ్యాట్టింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ 9 పరుగులకే పెవిలియన్ చేరుకోగా ..మరో ఓపెనర్ ప్రియమ్ గర్గ్ 42 పరుగులు చేశాడు. అయితే రాహుల్ త్రిపాటి 76 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ తో జట్టు స్కోర్ బోర్డు ను పరుగెత్తించింది. చివర్లో పూరన్ 38 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.మర్కరమ్ 2 , వాషింగ్టన్ సుందర్ 9 , కెప్టెన్ విలియమ్సన్ 7 బంతుల్లో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో రమణదీప్ సింగ్ మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకుని సన్‌రైజర్స్‌ను దెబ్బతీశాడు. బూమ్రా, డానియల్ శామ్స్, మెరిడిత్ తలో వికెట్ దక్కింది . రెండవ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ముంబయి ఇండియన్స్‌ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 48 ,
ఇషాన్ కిషన్ 43 కూడా పెవిలియన్ బాట పట్టాడు. తిలక్ వర్మ 8 (9) , డానియల్ శామ్స్ 15 ,టిస్టన్ స్టబ్స్ రెండు పరుగులు మాత్రమే చేయగలిగారు. టిమ్ డేవిడ్ వీరోచిత ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 18 బంతుల్లో 46 పరుగులు చేసాడు. డేవిడ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అనవసరపు రన్‌కి ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో రమణదీప్ సింగ్ 6 బంతుల్లో 14 పరుగులు చేసి పోరాడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీసుకోగా.. భువనేశ్వర్, సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. మరో ఇద్దరు రనౌట్‌గా వికెట్లు కోల్పోయారు.
ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. చెమటలు పట్టించారు.





Untitled Document
Advertisements