అమెరికాలో శాశ్వత సభ్యత్వం కోసం గ్రీన్ కార్డుకు గ్రీన్ సిగ్నల్ ..

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 11:22 AM

అమెరికాలో శాశ్వత సభ్యత్వం కోసం గ్రీన్ కార్డుకు గ్రీన్ సిగ్నల్ ..

చదువు కోసం వెళ్లి ఉద్యోగం సంపాదించి అమెరికాలో స్థిరపడాలని భారతీయుల్లో చాలా మంది కలలుగంటుంటారు. శాశ్వత నివాసం ఏర్పరుచుకునేందుకు గ్రీన్ కార్డు కోసం భారత్ తో సహా పలు దేశాల యువత దీని కోసం దరఖాస్తు చేసుకుంటూ పెద్ద ప్రయత్నమే చేస్తోందని చెప్పవచ్చు . భారత్ నుంచి హెచ్-1 బి మీద అమెరికాకు వెళ్లిన ఉద్యోగులు ప్రస్తుతం ఇమిగ్రేషన్ విధానం వల్ల అధికంగా నష్టపోతున్నారు. గ్రీన్ కార్డుల ఇష్యూలో ఒక దేశానికి 7 శాతం అనే నిబంధనతో భారత్ కు మరింత నష్టం జరుగుతోంది. దీంతో దరఖాస్తులు భారీగా పెండింగులో పడుతున్నాయి. 2021లో అందుబాటులో ఉన్న 2.26 లక్షల కార్డుల్లో 65452 మాత్రమే మంజూరు అయ్యాయి.శాశ్వత నివాసం కోసం భారతీయులు గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. సోమవారం జరిగిన కమిషన్ సమావేశంలో భారత అమెరికన్ల నాయకుడు అజయ్ జైన్ భుటోరియా ఈ అంశాన్ని లేవనెత్తాడు. దీంతో పెండింగ్ లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తులన్నీ ఆరునెలల్లోపు ప్రాసెస్ చేయాలని ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ కమిషన్ అధ్యక్షుడు జో బైడెన్ కు ఏకగ్రీవంగా సిపారసు చేసింది. దీంతో అమెరికాలో శాశ్వత నివాసం కోసం కలలు గంటున్న ఆశలు ఫలించాయనే చెప్పవచ్చు. . బైడెన్ ఈ ఫైల్ పై ఒకే చెబితే ఇక భారతీయుల గ్రీన్ కార్డు కల ఫలించినట్లే.గ్రీన్ కార్డుతో పాటు ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్లు డీఏసీఏ రెన్యూవల్స్ ఇతర అప్లికేషన్ల సమయాన్ని కూడా తగ్గించాలని సిఫార్సు చేశారు. వర్క్ పర్మిట్లు ట్రావెల్ డాక్యుమెంట్లు తాత్కాలిక పొడిగింపులు ఇతర మార్పులను మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్రతిపాదించారు. శాశ్వత నివాసం కోసం అమెరికా జారీ చేసే గ్రీన్ కార్డ్ ఇష్యూపై ఉన్న పరిమితులను తొలగించేందుకు రంగం సిద్ధం అవుతోందనే చెప్పవచ్చు . యూఎస్ కాంగ్రెస్ హౌస్ జ్యూడీషియరీ కమిటీ అగ్రరాజ్య ఇమిగ్రేషన్ నిబంధనల్లోని ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రైంట్ వీసాల విషయంలో దేశాల వారీ పరిమితిని ఎత్తివేస్తున్నారు.






Untitled Document
Advertisements