కాంగ్రెస్ కు హార్దిక్ పటేల్ గుడ్ బై ..

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 12:10 PM

కాంగ్రెస్ కు హార్దిక్ పటేల్ గుడ్ బై ..

గుజరాత్ లో పాటీదర్ రిజర్వేషన్ ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి షాక్ ఇచ్చారు. గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పాటీదర్ ఉద్యమ నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్‌కు అధినాయకత్వం గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాహుల్ గాంధీని మరియు పార్టీ పెద్దల తీరును వివరిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. ‘అగ్ర నాయకులను నేను కలిసినప్పుడు.. వారు గుజరాత్‌కు సంబంధించిన సమస్యలను వినకుండా ఫోన్లతో గడిపారు’ అంటూ ఎవరి పేరును చెప్పకుండా సోనియాకు రాసిన లేఖలో కాంగ్రెస్ నాయకత్వం తీరును హార్దిక్ తప్పుబట్టారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉండాల్సిన వేళ మన నాయకుడు విదేశాల్లో ఉన్నారు’ అంటూ ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకత్వం గుజరాత్‌ ప్రజానీకం పట్ల తీవ్ర విముఖతతో ఉంది. ప్రజల ముందుకు వెళ్లడానికి సరైన కార్యచరణ లేకపోవడంతో.. ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని పటేల్ విమర్శించారు. ఇటివలే రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటన సందర్భంగా ఆయనతో కలిసి వేదికపై కనిపించిన హార్దిక్ పటేల్.. ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. అయితే హార్దిక్ పటేల్ రాజీనామాతో గుజరాత్ కాంగ్రెస్ లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయవచ్చు . ఎందుకంటే పాటీదార్ ఉద్యమ నేతగా ప్రజలలో ఎంతో పేరును సంపాందించుకున్నాడు హార్దిక్ . అయితే హార్దిక్ కు మద్దతుగా ఉన్న ప్రజానీకం అంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మారడం ఖాయం .





Untitled Document
Advertisements