బ్రిటన్ పర్యటనలో కేటిఆర్ .. ప్రముఖ కంపెనీలతో సమావేశం

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 04:49 PM

బ్రిటన్ పర్యటనలో కేటిఆర్ .. ప్రముఖ కంపెనీలతో సమావేశం

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ యూరప్ పర్యటనకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే . అయితే ప్ర‌స్తుతం కేటీఆర్ బ్రిట‌న్ లో పర్యటిస్తున్నారు. బ్రిట‌న్ రాజ‌ధాని లండ‌న్‌లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న బుధ‌వారం దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఆయా కంపెనీల‌కు వివరించారు. రాష్ట్రంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్‌, ఫార్మా, లైఫ్ సైన్సెస్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబ‌డుల‌కు గ‌ల అవ‌కాశాల‌ను వారికి వివ‌రించారు. ఇక పెట్టుబ‌డుల‌తో వచ్చే కంపెనీల‌కు తెలంగాణ‌లో వారికి కావలసిన నీరు, భూమి, విద్యుత్‌తో పాటు మాన‌వ వ‌న‌రులు ఉన్న విష‌యాన్ని తెలిపారు. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం ఇవ్వ‌లేనంతగా సదుపాయాలు, ప్రోత్సాహ‌కాలు అందిస్తున్నాము అనే విషయాన్ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ తెలియజేసారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ) ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ స‌మావేశానికి కేటిఆర్ అధ్య‌క్ష‌త వ‌హించడం విశేషం . ఈ స‌మావేశంలో కేటీఆర్ తో పాటు తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ కూడా హాజ‌ర‌య్యారు. దెలాయిట్‌, జేసీబీ, హెచ్ఎస్‌బీసీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్‌, రోల్స్ రాయిస్ స‌హా మ‌రిన్ని ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌తినిధుల‌తో జ‌రిగిన రౌండ్ టేబుల్ స‌మావేశానికి హాజర‌య్యాయి. ఈ సమావేశానికి సంబందించిన అంశాలను తెలంగాణా పరిశ్రమల శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

https://twitter.com/MinisterKTR/status/1526867429808574464?s=20t=NOlc4XxAOK-nkETa-V1akQ





Untitled Document
Advertisements