జ్ఞానవాపి మసీదులో శివలింగం .. స్పందించిన ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 05:43 PM

జ్ఞానవాపి మసీదులో శివలింగం .. స్పందించిన ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్

గత కొంతకాలంగా దేశమంతట మసీదులు, గుడుల విషయంలో హిందూ ముస్లింల మధ్య మతకలహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అదేతరహాలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉన్న ఫోటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి సంగతి తెలిసిందే.. అయితే ఈ అంశం పై యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. హిందూ ముస్లింల మధ్యన ఇప్పటికే సర్వే వివాదం మరింత ముదురుతున్న సమయంలో జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికిందని చెప్పడం అంటే అది హిందూయిజంపై దాడి చేయడమేనని అన్నారు. దేశంలోని నిర్మితమైన చాల మసీదులు నిర్మించడానికి ముందు.. ఆ స్థలంలో హిందూ దేవాలయాలే ఉండేవని అన్నారు. దేశంలోని ఆలయాలను కూల్చి నసీడులను నిర్మించలేదని, పెద్ద ఎత్తున జనం ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని తెలిపారు. అలాంటి మసీదులను ముట్టుకోరాదని తేల్చి చెప్పారు. వాటిని ముట్టుకోవద్దని, కాదని ప్రభుత్వం బలవంతపు చర్యలకు పూనుకుంటే మాత్రం ముస్లింలు తప్పకుండా అడ్డుకుంటారని స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎలాంటి తీర్పు వచ్చిందో తెలిసిందేనని అన్నారు. మత విద్వేషవాదులు తలుచుకుంటే దేశంలోని అన్ని మసీదుల్లోనూ కొలనుల్లో శివలింగాలను గుర్తిస్తారన్నారు. వాళ్లు తలచుకుంటే ఏదైనా జరుగుతుందన్నారు. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ముస్లింలు శాంతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు . అంతేకాక ముస్లింలు ఎవరూ న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని, జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయడం లేదని అన్నారు.





Untitled Document
Advertisements