భారత సంతతి మహిళకు బ్రిటన్ అరుదైన పోస్టు ..

     Written by : smtv Desk | Wed, May 18, 2022, 05:47 PM

భారత సంతతి మహిళకు బ్రిటన్ అరుదైన పోస్టు ..

భారత సంతతి మహిళకు బ్రిటన్ గవర్నమెంట్ నుండి కీలక పదవి బాధ్యతలు దక్కాయి. బ్రిటన్‌లో భారత సంతతి మహిళ అయిన డా. స్వాతి ధింగ్రాకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఆ దేశ ఆర్థికశాఖ మంత్రి రిషి సునక్ కీలక బాధ్యతలు అప్పగించారు. 2016 ఆగస్టు నుంచి వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో ఎక్స్‌టర్నర్‌ ఎంపీసీ సభ్యునిగా పనిచేస్తున్న మైఖేల్‌ సాండ్రూస్‌ స్థానంలో స్వాతి ఎంపికయ్యారు. వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో ఎక్స్‌టర్నర్‌ సభ్యురాలిగా నియమించారు.
2022 ఆగస్టు 9న ఆమె బాధ్యతలు చేపట్టి, మూడేళ్లపాటు ఈ పదవీలో కొనసాగుతారు. ప్రస్తుతం స్వాతి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే యూనివర్శిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌–మాడిసన్‌ నుండి ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. అయితే ఈమె డిగ్రీ విద్యాభ్యాసం మాత్రం ఇండియాలోనే జరగడం విశేషం .ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుండి మాస్టర్స్‌ డిగ్రీ పట్టా అందుకున్నారు. స్వాతి ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌ అప్లైడ్‌ మైక్రోఎకనామిక్స్‌లో స్పెషలైజేషన్‌ కలిగి ఉన్నారు. ఇంతగా అనుభవం ఉన్న ఆమె దీంతో ఈ బాధ్యతలు నిర్వర్తించనున్న తొలి భారత సంతతి మహిళగా స్వాతి గుర్తింపును సంపాదించుకున్నారు..





Untitled Document
Advertisements