బాదుడే బాదుడు జగనన్న పథకాలను వివరించడానికి బస్సు యాత్రలు షురూ

     Written by : smtv Desk | Thu, May 19, 2022, 11:10 AM

బాదుడే బాదుడు జగనన్న పథకాలను వివరించడానికి బస్సు యాత్రలు షురూ

ఈ వేసవి వేడితో పాటుగా ఆంధ్రాలో మరింత వేడి రగలబోతుంది . ఆంధ్రప్రదేశ్ లో సామాజికన్యాయం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల తీరును వివరించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతోన్న నేపథ్యంలో దానికి కౌంటర్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . గడచిన మూడేళ్ళుగా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు పై వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తదితర అంశాలను హైలైట్ చేయటానికే బస్సుయాత్ర ప్రారంభించబోతుంది జగన్ సర్కారు . అయితే ఈ యాత్ర మంత్రుల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీనుండి 29వ తేదీవరకు నాలుగు ప్రాంతాల్లో బస్సుయాత్రలు చేయటం ఇదే సమయంలో నాలుగు ప్రాంతాల్లో బహిరంగసభలు నిర్వహించాలని జగన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డిసైడ్ అయ్యింది. మంత్రివర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటి వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఎంపీ ఎంఎల్ఏలు సీనియర్ నేతలతో నాలుగురోజుల యాత్ర మొదలవుతుంది. శ్రీకాకుళం లేదా విజయనగరం జిల్లాలో యాత్ర మొదలవుతుంది. ఒకచోట బహిరంగసభ అనంతరం ఒకరోజు జిల్లాలో బహిరంగసభ తర్వాత బస్సుయాత్రలో నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ మండల కేంద్రాలను కూడా యాత్ర టచ్ చేస్తుంది. 27వ తేదీన రాజమండ్రి 28న నరసరావుపేట 29వ తేదీన అనంతపురంలో బహిరంగసభలు జరగబోతున్నాయి. బస్సుయాత్రతో రాజకీయ వేడి మరింతగా పెరిగిపోవటం ఖాయమని అర్ధమైపోతోంది. ఎలాగంటే ఇప్పటికే పథకాలఅమలు పేరుతో జగన్ ఆరుజిల్లాల్లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. అలాగే గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరుగుతోంది. దీనికి అదనంగా టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయాలని పిలుపిచ్చారు. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుండగానే రాష్ట్రంలో రాజకీయ వేడి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది.









Untitled Document
Advertisements