రాజశేఖర్ '' శేఖర్ " సినిమా అప్డేట్స్ ..

     Written by : smtv Desk | Thu, May 19, 2022, 11:46 AM

రాజశేఖర్ '' శేఖర్

టాలీవుడ్ లో రాజశేఖర్ జీవిత దంపతులు అందరికి సుపరిచితమే .. రాజశేఖర్ నటన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇటివల కాలంలో జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 'శేఖర్' సినిమా రూపొందిన విషయం అందరికి తెలుసు. అయితే మే 20 నా అనగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ .. 'గరుడ వేగ' ఒక నేపథ్యం తో సాగే మూవీ .. 'కల్కి' మరొక నేపథ్యంతో సాగే సినిమా. ఈ సారి కొత్తగా ఏదైనా చేయాలని అనుకుని అలాంటి ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తుండగా మలయాళ సినిమా 'జోసఫ్' నా దృష్టికి వచ్చింది. ఈ కథ నా బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతుంది .. రీమేక్ లో నేను చేస్తే బాగుంటుందని భావించి రైట్స్ తీసుకోవడం తరువాత కరోనా భారిన పడటం జరిగింది. అందువలన మలయాళ సినిమా రైట్స్ ఎవరికైనా ఇచ్చేయమని జీవితతో చెప్పేశాను కూడా. ఆ స్థితికి వెళ్లిపోయిన నేను అభిమానుల ప్రార్ధనల వలన బ్రతికి బయటపడ్డాను. మొత్తానికి అనేక కష్టాలను ఎదుర్కుంటూ ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది. 'శేఖర్' కథ .. కథనం చాలా కొత్తగా సెంటిమెంట్ తో కూడిన ఎమోషనల్ థ్రిల్లర్ గా ఉండబోతుందని పేర్కొన్నారు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అందువల్లనే ఫస్టు షో టాక్ చూసిన తరువాతనే నెక్స్ట్ షోకి వెళ్లమని చెబుతున్నాను. ఈ కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే అలా చెబుతున్నాను" అని అన్నారు.ఈ సినిమాలో నేను సిగరెట్ తాగుతూ బుల్లెట్ పై వెళ్లే సీన్ చాలామందికి నచ్చింది. యూత్ నుంచి కూడా ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ మాదిరిగా ఒక యాటిట్యూడ్ కనిపిస్తోందని వాళ్లు అంటున్నారు. నిజానికి 'అర్జున్ రెడ్డి' సినిమాకి అంతకుముందు నేను చేసిన 'శేషు' .. 'ఓంకారం' సినిమాలు ప్రేరణ అని ఒక స్టేజ్ పై దర్శకుడు సందీప్ రెడ్డి చెప్పాడు. ఆ బాడీ లాంగ్వేజ్ .. యాటిట్యూడ్ మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తున్నాయన్నమాట.





Untitled Document
Advertisements