పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేయడం సరికాదు

     Written by : smtv Desk | Thu, May 19, 2022, 12:37 PM

పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేయడం సరికాదు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆయన తనయుడు కేటిఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి మరియు ఏ మంత్రి చేయనంతగా ఇటివల కాలంలో విరుచుకుపడుతున్నారు. విద్య, వైద్యం వంటి కీలక రంగాలను పట్టించుకోకుండా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పనిలో కేంద్రం వేలుపెడుతోందని మండిపడ్డారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన పట్టణ, పల్లె ప్రగతి కార్యాక్రమాలపై సమీక్ష సందర్భంగా ఆయన తాజాగా మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలను సంధించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పంచాయతీ రాజ్ వ్యవస్థ అత్యంత కీలకమని.. కానీ, తొలి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలను నమ్మకుండా నేరుగా గ్రామాలను నిధులను పంపిణీ చేయడం పట్ల మండిపడ్డారు. స్థానిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే స్పష్టమైన అవగాహన ఉంటుందని చెప్పారు. పీఎం గ్రామ్ సడక్ యోజన, ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాలకు గాను స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను పంపించడం సరైనది కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు . అంతేకాక ఈ సమావేశంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు పై అధికారులను ఆరా తీసారు . తెలంగాణ రైతులు పండించిన మొత్తం వరిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ గతంలోనే వెల్లడించారు . 56 లక్షల టన్నుల వరిలో ఇప్పటికే 20 లక్షల టన్నులను కొనుగోలు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.





Untitled Document
Advertisements