ఐపిఎల్ చరిత్రలో లక్నో ఓపెనర్స్ సరికొత్త రికార్డు ..

     Written by : smtv Desk | Thu, May 19, 2022, 03:14 PM

ఐపిఎల్ చరిత్రలో లక్నో  ఓపెనర్స్ సరికొత్త రికార్డు ..

ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్‌ బర్త్ కోసం గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 20 ఓవర్లలో 210 చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ లే ఇన్నింగ్స్ చివరి వరకు ఒక్క వికెట్ పడనివ్వకుండా ఆడడం విశేషం . క్వింటన్ డికాక్ 140 పరుగులు కేవలం 70 బంతుల్లోనే చేసాడు అంటే ఎంత విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడో అర్ధం చేసుకోవచ్చు.ఇందులో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో కోల్కత బౌలర్ లపై విరుచుకు పడ్డాడు . క్వింటన్ ఆటను చూసిన కేఎల్ రాహుల్.. సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రోటేట్ చేస్తూ డికాక్ కి తోడుగా కెప్టెన్ రాహుల్ ఏ మాత్రం తగ్గకుండా హాఫ్ సెంచరీతో 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 4 సిక్సర్లు నమోదు చేసాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ కావడం విశేషం. కోల్‌కతా బౌలర్లు అందరు ఈ ఇద్దరికీ గట్టిగా పరుగులు సమర్పించేసుకున్నారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ 57 పరుగులు వరుణ్ చక్రవర్తి 38, ఉమేశ్ యాదవ్ 34 రసెల్ మూడు ఓవర్లలో 45 పరుగులు సునీల్ నరైన్ ఒక్కడే 27 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. ఈ మ్యాచ్ తో లక్నో జట్టు ప్లే ఆప్స్ కి చేరుకోగా కేకేఆర్ జట్టు ఈ సీజన్లో ఇంటికి పయనమయ్యింది.





Untitled Document
Advertisements