తెలంగాణా ముఖ్యమంత్రిని కలిసిన తమిళ హీరో

     Written by : smtv Desk | Thu, May 19, 2022, 05:03 PM

తెలంగాణా ముఖ్యమంత్రిని కలిసిన తమిళ హీరో

తమిళ ప్రముఖ హీరో విజయ్ తలపతి తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిసారు. అయితే బుధవారం ప్రగతి భవన్ కు వెళ్లి మరీ ముఖ్యమంత్రిని కలవడం వల్ల అందరిలోనూ వీరి భేటి పట్లా ఆసక్తి నెలకొంది. అయితే వీరు ఏ అంశం దృష్టిలో ఉంచుకొని భేటి అయ్యారనేది ఇంకా తేలలేదు. మరో వైపు మ‌ర్యాదపూర్వ‌కంగానే కలిసారు అన్న వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన విజ‌య్‌కు టీఆర్ఎస్ ఎంపీ జోగినప‌ల్లి సంతోష్ కుమార్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అయితే ఈ సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉండటం వల్ల సాదారణ సమావేశమే అని తెలుస్తుంది. ఇకపోతే విజయ్ తలపతి రాజకీయాల్లోకి రావడం అనేది అంతా తన అభిమానులే నిర్దారిస్తారని ఆయన గతంలో స్పష్టం చేసారు కూడా ..అయితే గతంలో జరిగిన ఎన్నికల సమయంలో విజయ్ ఓటు వేయడానికి సైకిల్ పై రావడం అందరు రాజకీయాల్లోకి వస్తున్నారు అది పెట్రోల్ రేట్స్ కి నిరసనగా అలా వచ్చారనే వార్తలు ఇంటర్నెట్ లో కూడా వెల్లువెత్తాయి. అయితే నిన్న జరిగిన విజయ్ తలపతి మరియు ముఖ్యమంత్రి కెసిఆర్ మద్య సమావేశం గురించి ఎంపి సంతోష్ కుమార్ మరియు సిఎంవో తన ట్విట్టర్ ఖాతాలలో పోస్ట్ చేయడం జరిగింది .

https://twitter.com/MPsantoshtrs/status/1526925168870031360?s=20t=OuoOGLvwKyQSPYa4616tww

https://twitter.com/TelanganaCMO/status/1526928918795911169?s=20t=2amt_D7lsUttKUVmSiLL0Q





Untitled Document
Advertisements