ఐపీఎల్ కు కేన్ మామా దూరం హైదరాబాద్ ప్లే ఆప్స్ కు చేరాలంటే కష్టమే

     Written by : smtv Desk | Thu, May 19, 2022, 05:51 PM

ఐపీఎల్ కు  కేన్ మామా దూరం హైదరాబాద్  ప్లే ఆప్స్ కు చేరాలంటే కష్టమే

ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా చాలా జట్లు ప్లే ఆప్స్ బెర్తు కోసం పోరాడుతున్నాయి . నిన్న జరిగిన మ్యాచ్ తో కోల్ కత జట్టు ప్లే ఆప్స్ రేసులో నుండి తప్పుకోగా లక్నో జట్టు బెర్తును కాంఫామ్ చేసుకుంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తులు ఖాయం చేసుకోగా, మరో రెండు బెర్తుల కోసం పోరు రసవత్తరంగా మారింది. అయితే ఇప్పుడు ప్లే ఆప్స్ రేసులో నాలుగు మరియు ఐదవ స్థానాల్లో ఢిల్లీ కాపిటల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఉన్నాయి. అయితే హైదరాబాద్ జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతుంది. అయితే ఈ సీజన్లో లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్ దశ, ఆపై ఫైనల్ జరగనున్నాయి. సన్ రైజర్స్ ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ నెల 22న సన్ రైజర్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే హైదరాబాద్ జట్టు ప్లే ఆప్స్ రేసులో నిలవాలంటే ఈ విధమైన పరిస్థితులు నెలకొనాలి . 19 తారీఖున గుజరాత్ టైటాన్స్ తో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవాలి, 21తారీఖున జరిగే మ్యాచ్ లో ముంబయి చేతిలో ఢిల్లీ ఓటమిని చూడాలి .ఈ నెల 22న పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ గెలవాలి. దాంతో సన్ రైజర్స్ 14 పాయింట్లతో ఢిల్లీ, బెంగళూరు జట్లతో పాటు నాలుగో స్థానంలో నిలుస్తుంది. అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది. ఈ సమీకరణాలన్నీ పరిశీలిస్తే సన్ రైజర్స్ కు అత్యంత స్వల్ప అవకాశాలే ఉన్నా కూడా . జట్టులో కీలక బాద్యతలు వహించే కెన్ విలియంసన్ సీజన్ కు వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి వెళ్ళిపోవడం కూడా ఒక లోటు అనే చెప్పవచ్చు .





Untitled Document
Advertisements