గుజరాత్ పై బెంగళూరు ఘనవిజయం..

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 10:27 AM

గుజరాత్ పై బెంగళూరు ఘనవిజయం..

ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మద్య ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు గెలుపొంది ప్లే ఆప్స్ కు కొంతవరకు ఆశలు సజీవంగా ఉంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు బెంగళూరు జట్టు ముందుంచిన 169 పరుగుల లక్ష్యాన్న్ని సులభంగా చేదించింది. మొదటగా బాటింగ్ చేసిన గుజరాత్ జట్టులో శుబ్మాన్ గిల్ ఒక పరుగుకే పరిమితమవ్వగా , మరో ఓపెనర్ హా 31 పరుగులు చేసాడు . మ్యాథ్యూ వేడ్ 16 పరుగులకే పెవిలియన్ చేరుకోగా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 62 పరుగులతో జట్టును ముందుకు నడిపించాడు. మిగతా బట్టేర్లు మిల్లర్ 34 , రాహుల్ తెవాతియా 2 పరుగులు చేయగా రాషిద్ ఖాన్ 19 పరుగులు కేవలం ఆరు బంతుల్లోనే చేసి పాండ్యకు తోడుగా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో హెజల్‌వుడ్ 2, మ్యాక్స్‌వెల్, హసరంగ చెరో వికెట్ తీసుకున్నారు. గుజరాత్ నిర్దేశించిన 169 పరుగులతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ తొలి వికెట్‌కు 115 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి కారణం అయ్యారు . కోహ్లీ 73 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగా ,డుప్లెసిస్ 44 పరుగులు చేసి కోహ్లికి తోడుగా ఆడి అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 40 పరుగులను కేవలం 18 బంతుల్లోనే బాదాడు . దినేష్ కార్తీక్ 2 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు . గుజరాత్ బౌలర్లలో రాషిద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఏ మ్యాచ్ లో ఎప్పటి నుండో ఫాంలో లేని రన్ మెషిన్ విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు చేయడంతో అభిమానులలో ఆనందం ఉప్పొంగింది.





Untitled Document
Advertisements