దిశా కేసులో నిందితుల విచారణలో నేడు తుది తీర్పు..

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 10:55 AM

దిశా కేసులో నిందితుల విచారణలో నేడు తుది తీర్పు..

తెలంగాణ లో కలకలం రేపిన దిశా హత్యచార ఘటనలో నిందితులను సజ్జనార్ బృందం ఎన్కౌంటర్ కేసు గురించి సుప్రీమ్ కోర్ట్ రేపు తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ కేసుకు సంబందించి సిర్పూర్ కర్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సిర్పూర్ కర్ కమిషన్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై కోర్టు కేసును సుదీర్ఘ విచారణ చేసి జనవరిలో సుప్రీంకోర్టుకు కమిటీ నివేదికను అందజేసింది. విచారణ చేసిన కమిషన్ బాధిత దిశ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి నివేదికను సుప్రీంకోర్టుకి అందజేసింది. యువవైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులను విచారణ సమయంలో పోలీసులు ఎన్కౌంటర్ జరపగా నలుగురు నిందితులు మరణించారు. ఆ ఘటనపై మానవహక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్​పై విచారణ జరిపేందుకు. 2019 డిసెంబర్‌ 12న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సిర్పుర్కర్‌ కమిషన్‌ను నియమించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదికను కమిషన్ కోర్టుకు అందించగా ఈ కేసు పై అసలైన తీర్పు నేడు వెలువడనుంది.





Untitled Document
Advertisements