ఆంధ్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 12:35 PM

ఆంధ్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అమరరాజా బ్యాట్టేరిస్ కంపెనీ పై ఎటువంటి చర్యలను తీసుకోవద్దని సుప్రీమ్ కోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన విద్యుత్ పంపిణీ కంపెనీకి ఆదేశాలు పంపించింది. అయితే అమరరాజా కంపెనీ తెలుగు దేశం పార్టీకి చెందినా పార్లమెంట్ సభ్యుడు ఎంపి గల్లా జయదేవ్ కు సంబంధించినది కావడం విశేషం. కక్ష్యపూరితంగాన్బే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు గోల చేస్తున్నారు. అయితే అమరాజాన్ బట్టేరీస్ కంపెనీ పై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి హై కోర్టులో పిర్యాదు పై నోటిసుల ప్రకారం కంపెనీ పై చర్యలు తీసుకోవచ్చని అదేశాలివ్వగా , హై కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అమరరాజా బట్టేరీస్ యాజమాన్యం సుప్రేం కోర్టును ఆశ్రయించింది. అయితే దీనిపై సుప్రీమ్ కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎన్ వి రమణ మరియు హిమ కోహ్లిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కాలుష్య నియంత్రణ మండలిలకు షాక్ ఇచ్చింది. తదుపరి విచారణ పూర్తి అయ్యేంత వరకు అమరరాజా బట్టేరీస్ కంపెనీ పై యాజమాన్యం పై ఎటువంటి చర్యలకు పాలపదవద్దని ఆదేశాలు జారీ చేసింది





Untitled Document
Advertisements