ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ కైవసం చేసుకున్న తెలుగుతేజం

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 12:36 PM

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్  కైవసం చేసుకున్న తెలుగుతేజం

ఈ ఏడాది భారత్ కు అచ్చోచ్చినట్టుంది. అటు థామస్ కప్ లో భారత ఆటగాళ్ళు పతకాన్ని ఇండియాకు శుభవార్త అందించారు . అంతలోనే భారత్ కు మరో శుభవార్త భారత్ కు వచ్చి చేరింది. ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ని భారత్ కైవసం చేసుకుంది. అందులోను తెలంగాణాకు చెందిన 25 ఏళ్ల యువ బాక్సర్ నిఖత్ జరీన్ భారత్ కు స్వర్ణ పతాకాన్ని అందించింది. గురువారం జరిగిన 52 కేజీల విభాగం ఫైనల్ లో స్వర్ణపతాకం తో అబ్బురపరిచింది. ఆమె ఈమె ఫైనల్ రౌండ్ లో థాయిలాండ్ కు చెందిన జిట్ పాంగ్ జుటమాస్ అనే బాక్సర్ పై 5 - 0 తేడాతో అజేయంగా గెలుపొందింది. ఈమె భారత్ కు స్వర్నపతాకాన్ని అందించడం వల్ల భారత్ లో అనంధచాయలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ కు ఐదు సార్లు పతకాలను అందించిన మేరీకోమ్‌, సరితాదేవి, ఆర్‌.ఎల్‌. జెన్నీ, లేఖ ల సరసన నిఖత్ జేరీన్ చేరింది. జూనియర్ ప్రపంచ ఛాంపియన్ గా ఇంతకు ముందే అందరిని అలరించిన నిఖత్ జరీన్ ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఛాంపియన్ షిప్ ను గెలవడం వల్ల అందరు ఆమెను అభినందిస్తున్నారు. నిఖత్ జరీన్ గెలుపు పై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించగా .. తెలంగాణా నిజామాబాదు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవితతో పాటుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అభినందనలు తెలియజేసారు. మరియు నిఖత్ జరీన్‌పై పలువురు సెలబ్రిటీలు , తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెకు అభినందనల తెలియజేస్తున్నారు.





Untitled Document
Advertisements