చెన్నై సూపర్ కింగ్స్ కి పదవ ఓటమి.. ప్లే ఆప్స్ కి రాజస్థాన్

     Written by : smtv Desk | Fri, May 20, 2022, 08:03 PM

చెన్నై సూపర్ కింగ్స్  కి పదవ ఓటమి.. ప్లే ఆప్స్ కి రాజస్థాన్

ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా శుక్రవారం రాయల్ రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ పడ్డాయి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ గైక్వాడ్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు అంతేకాక మరో ఓపెనర్ డీ కాన్వే 16 పరుగులతో పెవిలియన్ బాట పట్టాడు . కానీ వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన మోయిన్ అలీ 93పరుగులు చేసి విధ్వంసక ఇన్నింగ్స్ కొనసాగించాడు. అయితే తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో ఎంఎస్ ధోని ఒక్కడే 26 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ సింగల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు ముందుంచింది. చెన్నై జట్టు మొత్తం ఆరు వికెట్లు కోల్పోగా..రాజస్థాన్ టీమ్‌లో బౌలర్లు మెకాయ్ , చాహల్ లు తలా రెండు వికెట్లు తీసుకోగా ట్రెంట్ బౌల్ట్ రవి చంద్రన్ అశ్విన్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 పరుగులతో తనదైన మార్క్ ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. ఇక మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లందరూ తొందరగానే వెనుదిరిగిన ఆల్ రౌండర్ అశ్విన్ అందరినీ ఆకట్టుకున్నాడు కేవలం 23 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్స్ క్వాలిఫై అవ్వగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీజన్లో పదవ ఓటమిని చవిచూసింది.





Untitled Document
Advertisements