జ్ఞాన వాపి మసీదు కేసులో కోర్టు పై పూర్తి నమ్మకం ఉంది : ఓవైసీ

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 12:04 PM

జ్ఞాన వాపి మసీదు కేసులో కోర్టు పై పూర్తి నమ్మకం ఉంది : ఓవైసీ

ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ జ్ఞానవాపి మసీదు అంశం మరియు దిశ అత్యాచార కేసులు నేరస్తుల ఎన్కౌంటర్ మొదలైన అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్ఞానవాపి మసీదు అంశాన్ని మరో బాబ్రీ మసీదు అంశంగా మార్చి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా బిజెపికి ఓటు బ్యాంకు అందించడంలో భాగంగా ఇదంతా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మధుర అంశాన్ని కూడా ఇదే విధంగా ఈ తీర్చిదిద్దే పనిలో ఉన్నారని అసదుద్దీన్ మండిపడ్డారు అలాగే జ్ఞాన వాపి మసీదు కేసు విచారణలో కోర్టు పై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. అలాగే దిశా నిందితుల కు సంబంధించిన తీర్పు నిన్న వెలువడినందుకు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. బూటకపు ఎన్కౌంటర్లు కి తాను వ్యతిరేకమని పోలీసులే ఇటువంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని పేర్కొన్నాడు .





Untitled Document
Advertisements