అస్సాం రాష్ట్రంలో వరదల కల్లోలం.. రైల్వే ట్రాక్ పై వరద బాధితులు

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 12:32 PM

అస్సాం రాష్ట్రంలో వరదల కల్లోలం.. రైల్వే ట్రాక్ పై వరద బాధితులు

అస్సాం రాష్ట్రంలో వరదలు కల్లోలం రేపుతున్నాయి . ఇప్పటికే అనేక గ్రామాలు నీట మునిగాయి అంతేకాక కొన్ని గ్రామాల ప్రజలు ఇంకా ఆ నీటిలోనే అవస్థలు పడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో అయితే రైల్వే ట్రాక్ కొంచెం ఎత్తులో ఉండటం వలన గ్రామాన్ని వదిలి రైల్వే ట్రాక్ పై టార్పాలిన్ గుడారాలు ఏర్పాటు చేసుకుని సేద తీరుతున్నారు. అయితే వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోవడంతో నే ఇలా చేసినట్లు ఆ గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ వరదల కారణంగా రాష్ట్రం రాష్ట్రంలో 14 మంది చనిపోయారు అయితే కొన్ని గ్రామస్తులు మాత్రమే ప్రభుత్వం నుండి నిత్యావసరాలు మరియు సహాయక చర్యలు అందుతున్నాయని పేర్కొంటున్నారు. నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ , స్టేట్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక శాఖ బలగాలతో పాటు స్థానికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పటియా పాథర్‌ అనే ప్రాంతంలో కొద్ది మందికి నిత్యావసరాలు సమకూర్చారని నాలుగైదు రోజుల తర్వాత వాటిని కూడా ఇవ్వడం మానేశారు అని వరద బాధితులు తమ అవస్థలు చెప్పుకుంటున్నారు. ఈ వరదల కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొండచరియలు విరిగి పడిపోయి రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారింది.





Untitled Document
Advertisements