గ్రామ పంచాయతీ నిధులపై ఫిర్యాదు..రాజేంద్ర ప్రసాద్

     Written by : smtv Desk | Sat, May 21, 2022, 01:53 PM

గ్రామ పంచాయతీ నిధులపై  ఫిర్యాదు..రాజేంద్ర ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై పంచాయతీరాజ్ శాఖ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఏపి పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ వ ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి తమ ఖాతాలో వేసుకుంటుంది అని ఆయన గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కాగా వీటివల్ల గ్రామ స్థాయిలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని .. దీని వలన గ్రామాలలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ వంటి సౌకర్యాలను తమ గ్రామాల ప్రజలకు కల్పించడానికి నిధులు లేక సర్పంచులు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలకు రూపాయలు 7665 కోట్లు విడుదల చేయగా ఎటువంటి చర్చలు ఏమి జరపకుండా ప్రభుత్వం ఎవరి సంతకాలు కూడా తీసుకోకుండా వాటిని వేరే పథకాలకు అన్వయించుకుని చేశారని ఆయన గవర్నర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు మరియు గ్రామ స్థాయి నాయకులు అంతా ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements