పీఎన్‌బీ ఏటీఎం ఛార్జీల బాదుడు.. ఏకంగా రూ.645 కోట్లు వసూలు

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 06:49 AM

పీఎన్‌బీ ఏటీఎం ఛార్జీల బాదుడు.. ఏకంగా రూ.645 కోట్లు వసూలు

పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) ఇది ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకు. ప్రస్తుతం పీఎన్‌బీ ఏటీఎం లావాదేవీల ఛార్జీల కింద తన ఖాతాదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బుని వసూలు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారుల నుంచి ఏటీఎం ఛార్జీల కింద రూ.645.67 కోట్ల మొత్తాన్ని వసూలు చేసినట్టు పీఎన్‌బీ ప్రకటించింది. ఆర్‌టీఐ యాక్ట్ కింద దాఖలైన ఓ దరఖాస్తుకి సమాధానంగా పీఎన్‌బీ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతే కాక బ్యాంకు అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌లను నిర్వహించని కస్టమర్ల నుంచి భారీగానే పెనాల్టీల కింద కుడా భారీ మొత్తంలో డబ్బును ఈ బ్యాంకు వసూలు చేసింది. మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ కింద రూ.239.09 కోట్లను ఆర్జించినట్టు దేశంలోని రెండో అతిపెద్ద బ్యాంకు తెలిపింది. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ అప్లికెంట్ చంద్రశేఖర్ గౌర్ ఈ ఆర్‌టీఐ అప్లికేషన్ వేశారు.
2020-21 ఎకనామిక్ ఇయర్ లో ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌లను మెయింటైన్ చేయనందుకు బ్యాంకు వసూలు చేసిన ఛార్జీలు కేవలం రూ.170 కోట్లుగానే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఈ ఛార్జీలు భారీగా పెరిగాయి. 85,18,953 అకౌంట్ల నుంచి ఈ మొత్తాన్ని బ్యాంకు సేకరించిందని పీఎన్‌బీ తెలిపింది. మార్చి 31, 2022 నాటికి 6,76,37,918 అకౌంట్లు జీరో బ్యాలెన్స్ అకౌంట్లుగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది.
2018-19 నుండి 2021-22 మధ్య కాలంలో పీఎన్‌బీలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు స్థిరంగా పెరుగుతూనే వస్తున్నాయి. 2019 మార్చి 31న పీఎన్‌బీలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు 2,82,03,379గా నమోదు కాగా 2021 మార్చి నాటికి ఈ అకౌంట్లు 5,94,96,731కు పెరిగాయి.





Untitled Document
Advertisements