ఇకపై పోస్టాఫీసుల్లో కుడా ఆధార్ అప్‌డేట్, ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చు!

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 06:54 AM

ఇకపై పోస్టాఫీసుల్లో కుడా  ఆధార్ అప్‌డేట్, ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చు!

ప్రస్తుత కాలంలో మనం బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, మొబైల్ సిమ్ కార్డు కొనాలన్నా, ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా ఆధార్ కార్డు అనేది ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్. మరి అలంటి ఆధార్ లో ఎవైన సరిచేయాల్సిన విషయాలు ఉంటె గనుక ఆధార్ కార్డు ఎన్‌రోల్ కోసం లేదా అప్‌డేట్ కోసం మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎవరైనా ఆధార్ అప్‌డేట్ లేదా ఎన్‌రోల్ చేసుకోవాలన్నా ఇక నుంచి మీకు దగ్గర్లోని పోస్టాఫీసులో చేసుకోవచ్చని ఇండియా పోస్టాఫీసు తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 13352 పోస్టాఫీసు కేంద్రాలు దేశ ప్రజలకు ఆధార్ సర్వీసులను అందించడంలో సాయపడతాయని ఇండియా పోస్టు ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ కేంద్రాలకు వెళ్లి ఆధార్ అప్ డేట్ లేదా ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్యాంకు బ్రాంచులు, పోస్టాఫీసులు ఆధార్ సెంటర్లుగా పనిచేస్తున్నాయి. ఇండియా పోస్టు వెబ్‌సైట్ ప్రకారం పోస్టాఫీసు ఆధార్ కేంద్రాలు ప్రధానంగా రెండు రకాల సర్వీసులను అందజేస్తున్నాయి. ఒకటి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, రెండు ఆధార్ అప్‌డేట్.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్:- ఎన్‌రోల్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా దేశ ప్రజల బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్ సమాచారాన్ని ఎలక్ట్రానిక్‌గా స్వీకరిస్తారు. పోస్టాఫీసుల్లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అనేది పూర్తిగా ఉచితం.
ఆధార్ అప్‌డేట్:- పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ వంటి డెమొగ్రాఫిక్ అప్‌డేషన్‌ను పోస్టాఫీసుల్లో చేసుకోవచ్చు.
బయోమెట్రిక్ అప్‌డేషన్‌ను, ఫోటోను, ఫింగర్ ప్రింట్లను, ఐరిస్‌ను పోస్టాఫీసుల ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఈ అప్‌డేట్ కోసం రూ.50ను(జీఎస్టీ కలుపుకుని) సర్వీసు ఛార్జీగా తీసుకుంటారు.
ఆధార్ అప్‌డేట్ కొరకు కేంద్రానికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు..
సపోర్టింగ్ డాక్యుమెంట్లకు చెందిన ఒరిజినల్ కాపీలు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌కు అవసరం. ఈ ఒరిజినల్ కాపీలను స్కాన్ చేసి, మీకు ఈమెయిల్ చేస్తారు. అదేవిధంగా ఒకవేళ మీ చేతి వేళ్లు గానీ కళ్లు దెబ్బతింటే కూడా ఆధార్‌కు అప్లయి చేసుకోవచ్చు.
అయితే ఆధార్ కార్డు జనరేట్ అవ్వడం కోసం 90 రోజుల సమయం పడుతుంది.





Untitled Document
Advertisements