ఈ కాలంలోనూ సినిమాను 175 రోజులు ఆడేలా చేసిన అఖండ విజయం ఆయనదే!

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 06:58 AM

ఈ కాలంలోనూ సినిమాను 175 రోజులు ఆడేలా చేసిన అఖండ విజయం ఆయనదే!

ప్రస్తుత కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడితే భారీ విజయం అదేవిధంగా నాలుగు వారాలు ఆడితే బ్లాక్ బస్టర్ విజయం అనే స్థాయిలో ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం వలన రెండు లేదా మూడు వారాలు.. మహా అయితే నాలుగు వారాలుయి అంతకన్నా ఎక్కువ ఏ మూవీ కూడా థియేటర్లలో ఉండటం లేదు. నాలుగు వారాలు మించి ఓకే సినిమా థియేటర్లలో ఉందంటే అదో వండర్ అన్నట్లుగా అయ్యింది పరిస్థితి .
అయినా మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాలుగు వారాల తర్వాత థియేటర్లకు చూసేందుకు ఓ ఒక్కరు కూడా ఉండటం లేదు. అందుకే థియేటర్లలో ఎంత పెద్ద స్టార్ హీరో చిత్రాలైనా కూడా ప్రస్తుతం 50 రోజులు ఆడటం అనేది చాలా పెద్ద విషయం అయ్యింది. వందలో ఒకటి రెండు సినిమాలు అక్కడో ఇక్కడో 50 రోజులు ఆడుతున్నాయి.
ఇలాంటి సమయంలో అఖండ చిత్రం ఒక థియేటర్ లో ఏకంగా 175 రోజులను పూర్తి చేసుకుంది. చిలకలూరి పేట లోని రామకృష్ణ అనే థియేటర్ లో అఖండ సినిమా 175 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరో 25 రోజుల పాటు చిత్రాన్ని ఆ థియేటర్ లో ఆడించి ఆ తర్వాత తొలగించే ఉద్దేశ్యంతో యాజమాన్యం ఉందని తెలుస్తోంది.
సినిమా 200 రోజులు పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ ముఖ్య అతిథిగా సినిమా యొక్క 200 రోజుల వేడుక నిర్వహిస్తామని థియేటర్ యాజమాన్యం పేర్కొన్నారు. బాలయ్య మరియు బోయపాటి కాంబోలో వచ్చిన మూడవ సినిమా అఖండ. అంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఈ చిత్రం లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంతటి భారీ విజయం బాలయ్యకే సాధ్యం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బాలయ్య వరుసగా ప్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయంలో అఖండ చిత్రం ఒక అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఆయన కెరీర్ మళ్లీ ఊపు అందుకునేలా స్పీడ్ పెంచేలా చేసింది. అందుకే అఖండ చిత్రం నందమూరి ఫ్యాన్స్ కు చాలా ప్రత్యేకంగా నిలిచింది. భారీ అంచనాల నడుమ రూపొందిన అఖండ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ ను కూడా చేస్తామంటూ అప్పుడు బాలయ్య చెప్పుకొచ్చాడు.
వెనువెంటనే కాకున్నా కొన్ని సంవత్సరాల తరువాతైనా అఖండ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే బాలయ్య గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఒక చిత్రం చేస్తున్నారు. తరువాత ఎఫ్ 3 సినిమా డైరెక్టర్ అనీల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు.





Untitled Document
Advertisements